Nagarjuna And Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా నాగార్జున ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన చేసిన సినిమాలు మొదట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక దాంతో ఈయన హీరోగా ఎదగడం కష్టమని అందరు అనుకున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతో ఒక్కసారిగా నాగార్జున స్టార్ హీరో గా మారిపోయాడు.
ఇక ఇదే రీతిలో ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు కూడా మొదట్లో ఒకటి రెండు సినిమాలతో తడబడ్డప్పటికి ఆ తర్వాత మంచి సినిమాలను చేసి స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణకి, నాగార్జునకి మధ్య చాలా రోజుల నుంచి మాటలు లేవనే విషయాలు సోషల్ మీడియాలో చాలా సార్లు వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య మాటలు లేకపోవడానికి కారణం ఏంటో ఎవరికి తెలియదు కానీ బాలయ్య మీద మీద కోపంతోనే నాగార్జున ఒక సినిమా చేశాడు అంటూ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.
అది ఏ సినిమా అంటే ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన హలో బ్రదర్ అనిల్ తెలుస్తుంది. ఇక ఈ సినిమాని మొదట ఇవివి గారు బాలయ్య తో చేద్దామని అనుకున్నాడట. కానీ అనుకోకుండా ఈ స్క్రిప్ట్ లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాని చేశాడు. ఇక దాంతో అప్పటి నుంచి నాగార్జునకి, బాలయ్య బాబుకి పెద్దగా మాటలు లేవనే వార్తలు అయితే బయటికి వచ్చాయి. ఇక వీళ్లిద్దరూ ఒకటి రెండుసార్లు అడపదడపా కలుసుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం అంత సానిహిత్యం గా కలిసి ఉన్న రోజులైతే ఎప్పుడు లేవు అని చాలామంది చెబుతున్నారు…
ఇక ఇప్పటికి కూడా బాలయ్య బాబుకి, నాగార్జునకి మధ్య మాటలు లేవు అనేది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే వస్తుంది. ఎందుకంటే నాగార్జున ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు బాలయ్య బాబుని ఇన్వైట్ చేయడు. అలాగే బాలయ్య బాబు కూడా నాగార్జున ని ఇన్వైట్ చేయడు ఇలా వీళ్ళిద్దరి మధ్య చాలా రోజుల నుంచి డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. అందువల్లే వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…