Nagarjuna And NTR: ‘కూలీ'(Coolie Movie) తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం లో రజినీకాంత్(Superstar Rajinikanth) పంపిన ఒక వీడియోలో ఆ చిత్రం లో విలన్ గా నటించిన అక్కినేని నాగార్జున గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. డబ్బుల కోసం ఆయన ఈ చిత్రం లో విలన్ గా చెయ్యాల్సిన అవసరమే లేదు, కొన్ని వందల కోట్ల రూపాయలకు అధిపతి ఆయన. కానీ ఈ చిత్రం లో ఆయన చెయ్యడానికి కారణం, మంచోడిగా ఇన్నేళ్లు నటించి బోర్ కొట్టి ఇలా విలన్ గా చేసి ఉండొచ్చు, భాషలో ఒక ఆంటోనీ ఎలాగో , కూలీ లో సైమన్ క్యారక్టర్ అలా నిలిచిపోతుంది అని చాలా గొప్పలు చెప్పుకొచ్చాడు. కానీ తీరా క్యారక్టర్ చూస్తే చాలా కామెడీ గా ఉంది. ఒక రెగ్యులర్ విలన్ క్యారక్టర్ కోసం నాగార్జున ని తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కి ఎలా వచ్చిందో, ఈ రెగ్యులర్ విలన్ క్యారక్టర్ కోసం నాగార్జున ఒకటికి ఆరు సార్లు లోకేష్ ని ఇంటికి పిలిపించుకొని కథ చెప్పించుకున్నాడో అభిమానులకు అసలు అర్థం అవ్వడం లేదు.
Nagarjuna And NTR 2వ రోజు హిందీలో దున్నేస్తున్న ‘వార్ 2’..గ్రాస్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉందంటే!
జగపతి బాబు,శ్రీకాంత్ వంటి వారు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారంటే వాళ్ళేమి గతంలో పెద్ద సూపర్ స్టార్స్ కారు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ లేదు. కానీ నాగార్జున(Akkineni Nagarjuna) నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో ఒకరు. ఆయనకంటూ తెలుగు రాష్ట్రాల్లో ఒక భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు అభిమానుల మనస్సు ఎంత బాధపడుతుందో ఆయన కనీసం కూడా పట్టించుకోలేదని అభిమానులు వాపోతున్నారు. హీరో గా ఒక్కో సినిమాకు నాగార్జున 7 నుండి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. కానీ కూలీ లో విలన్ క్యారక్టర్ చేసినందుకు ఆయన అక్షరాలా పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట. కేవలం రెమ్యూనరేషన్ కోసమే ఆయన ఇలాంటి క్యారక్టర్ చేశాడు అనడానికి ఇంతకంటే ఆధారం ఇంకేమి కావాలి?.
నిన్న కూలీ తో పాటు విడుదలైన ‘వార్ 2′(War 2 Movie) లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పరిస్థితి కూడా ఇంతే. ఫస్ట్ హాఫ్ వరకు ఎదో పర్లేదు, హీరో హృతిక్ రోషన్ తో కలిసి కొన్ని ఆపరేషన్స్ చేశాడు, పర్వాలేదు ఇద్దరినీ బాగానే బ్యాలన్స్ చేశాడు అనుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎన్టీఆర్ ని ఫక్తు విలన్ క్యారక్టర్ లో చూపించాడు. ఒక అభిమాని తమకు ఇష్టమైన హీరోని ఇలాంటి క్యారక్టర్ లో చూడాలని కోరుకుంటారా?, అది కూడా ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ ని. కానీ ఆయన ఈ సినిమా చేసాడంటే కేవలం రెమ్యూనరేషన్ కోసమే కదా. ఈ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా నా వెంటపడి, బ్రతిమిలాడి మరీ ఈ చిత్రం చేయడానికి ఒప్పించాడు అంటూ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. మీ అభిమానులు గర్వపడే సినిమా తీస్తా అంటూ ఆయనకు మాట ఇచ్చాడు. అభిమానులు గర్వపడే మాట కాసేపు పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ కి ఏమైంది అంటూ అభిమానులు బాధపడే స్థాయిలో ఆయన్ని చూపించారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం హృతిక్ రోషన్ కంటే ఎక్కువ గా ఎన్టీఆర్ నే రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఆయన కూడా రెమ్యూనరేషన్ కోసం ఇలాంటి క్యారక్టర్ చేయడం ఏంటో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలా ఈ ఇద్దరు తెలుగు హీరో నిన్న అభిమానుల మనసుల్ని తీవ్ర స్థాయిలో గాయపరిచారు.