https://oktelugu.com/

Samantha Nagachaitanya: పెళ్లికి ముందే విడాకులవుతాయని చైతన్య-సమంతకు తెలుసా?

Samantha Nagachaitanya: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంతల జోడి విడిపోనుందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై అటు అక్కినేని ఫ్యామిలీ ఇప్పటివరకు స్పందించడం లేదు. సమంత మాత్రం దూరం అయ్యామనేలా లీకుల మీద లీకులు ఇస్తూ అసలు విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. వీళ్లదరూ వేర్వేరుగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది. అయితే సమంతతో తనకు విడాకులు అవుతాయన్న విషయం నాగచైతన్యకు, అక్కినేని ఫ్యామిలీకి ముందే తెలుసా? […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2021 / 05:11 PM IST
    Follow us on

    Samantha Nagachaitanya: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంతల జోడి విడిపోనుందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై అటు అక్కినేని ఫ్యామిలీ ఇప్పటివరకు స్పందించడం లేదు. సమంత మాత్రం దూరం అయ్యామనేలా లీకుల మీద లీకులు ఇస్తూ అసలు విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. వీళ్లదరూ వేర్వేరుగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది.

    అయితే సమంతతో తనకు విడాకులు అవుతాయన్న విషయం నాగచైతన్యకు, అక్కినేని ఫ్యామిలీకి ముందే తెలుసా? అంటే ఔననే అంటున్నాయి కొన్ని సన్నిహిత వర్గాలు. మూడేళ్ల క్రితం వీరి పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి వీరిద్దరి జాతకం చూసి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత-నాగచైతన్యలు పెళ్లి చేసుకుంటే వారిద్దరి జీవితం సాఫీగా సాగదని ఆయన నాడు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    జాతకాలు చెబుతూ వివాదాస్పద స్టేట్ మెంట్లు ఇచ్చే తెలుగురాష్ట్రాల్లోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. అప్పట్లో నాగచైతన్య-సమంత పెళ్లికూడా హాట్ కామెంట్స్ చేశారు. సినీ రాజకీయ రంగాలపై పట్టు ఉందని చెప్పుకునే ఈయన తాజాగా చైతన్య-సమంత విడాకులపై స్పందించారు.‘సమంత, నాగచైతన్య జాతకాల ప్రకారం పెళ్లి చేసుకుంటే విడిపోతారని.. వాళ్లకు సమస్యలు వస్తాయని అప్పుడే చెప్పాను.. ఇద్దరి మధ్య దూరం పెరగొచ్చని.. విడిపోవచ్చని.. పిల్లలు పుట్టకపోవచ్చు’ అని అప్పటి వీడియోలోనే చెప్పానని వివరించారు. అదే ఇప్పుడు నిజమైందని అంటున్నారు.

    దీన్ని బట్టి జాతకాలు కలువకున్నా.. చైతూ-సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి వీరి జాతకాలు కలువలేదనే విషయం తెలుసు అని అంటున్నారు. అదే ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడానికి కారణమవుతోందా? అంటే జ్యోతిష్యులు ఔననే అంటున్నారు. చూడాలి మరీ ఈ జాతకాలు నిజమో కాదో..