The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని నాని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నింటిలో ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబోతుందని ఇప్పటివరకు తనకున్న ఇమేజ్ మొత్తాన్ని మార్చేసి పూర్తిగా మాస్ హీరో గా తనను మార్చే అవకాశం ఉందని కూడా నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కి గాని సాంగ్ గాని విశేషమైన ఆదరణ రావడంతో నాని ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఈ మూవీలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబు సైతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ ఫైట్ లో పాల్గొన్నాడు. ఇక అప్పుడే ఆయన నాని మీద చేయి చేసుకున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మొత్తానికైతే సినిమా ఫైట్ లో భాగంగా నాని చెంప మీద మోహన్ బాబు ఒక్క దెబ్బ అయితే గట్టిగా కొడతారట. దాంతో నాని కిందపడి లేచి మోహన్ బాబు మీద ఎలా తిరిగి దాడి చేశాడు అనేది ఈ క్లైమాక్స్ ఫైట్ లో మనం చూడబోతున్నాం. ఇక ఈ సినిమాలో భాగంగా మోహన్ బాబు నాని కొట్టారు. అంతే గాని నిజజీవితంలో విభేదాలు ఉండి లేదంటే పర్సనల్ ప్రాబ్లం వల్లనో అయితే ఆయన అతని మీద చేయి చేసుకోలేదు.
ఇక సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఈ న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అయినప్పటికి ఎవరు కూడా పెద్దగా దీనిమీద స్పందించడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ప్యారడైజ్ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి సెప్టెంబర్ నెలలో అయిన రిలీజ్ కి తీసుకువస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…