Mahesh Babu Ramayana: మన టాలీవుడ్ నుండి శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పాత్రలకు బాగా సూట్ అయ్యే హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu). ఈ పాత్రలకు నేటి జనరేషన్ లో మహేష్ బాబు ని తప్ప ఎవ్వరిని ఊహించుకోలేము. రాజమౌళి(SS Rajamouli) మహాభారతం ఎప్పుడు తీస్తాడో తెలియదు కానీ, ఒకవేళ తీస్తే మాత్రం శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు కోసం రిజర్వ్ చేసినట్టే. అయితే రీసెంట్ గానే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి(Nithish Tiwari) 1600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘రామాయణ్'(Ramayan Movie) కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ లో సినిమా గురించి ఎక్కువగా చూపించలేదు కానీ, మన ఇండియన్ సినిమాని స్టాండర్డ్స్ పరంగా మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చింది ఈ చిత్రం.
Also Read: విడుదలకు ముందే ప్రభంజనం..అక్షారాలా 500 బెనిఫిట్ షోస్..’వార్ 2′ క్రేజ్ మామూలుగా లేదుగా!
ఇందులో శ్రీ రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor), రావణుడిగా రాకింగ్ స్టార్ యాష్(Rocking Star Yash), సీతగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో శ్రీ రాముడి క్యారక్టర్ కోసం ముందుగా డైరెక్టర్ నితీష్ తివారి సూపర్ స్టార్ మహేష్ బాబు నే అడిగాడట. కానీ ఆయన రాజమౌళి సినిమాకు భారీ గా డేట్స్ ఇవ్వాల్సి అవసరం రావడంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత నితీష్ తివారి ఈ చిత్రాన్ని రణబీర్ కపూర్ తో చేయాల్సి వచ్చింది. రణబీర్ కపూర్ కూడా శ్రీ రాముడి క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మన తెలుగు హీరో చేసి ఉండుంటే మనకి ఎంతో సంతృప్తి మిగిలేది. అదే విధంగా రావణాసురిడి క్యారక్టర్ కోసం రాకింగ్ స్టార్ యాష్ కంటే ముందుగా హృతిక్ రోషన్(Hrithik Roshan) ని అడిగారట మేకర్స్.
కానీ ఆయన కూడా డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం తో ఈ చిత్రం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకవేళ హృతిక్ రోషన్ ఈ చిత్రం చేసుంటే హిందీ లో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడేది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం బడ్జెట్ దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఈమధ్య కాలంలో ఒక సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడం ఎక్కడా చూడలేదు. మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు కూడా 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇక రెండవ భాగం బడ్జెట్ 600 కోట్ల రూపాయిలు ఉంటుందట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి రావణుడిగా నటిస్తున్న యాష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట. మొదటి భాగం లో రాముడు అరణ్యానికి వెళ్లడం, ఆ తర్వాత రావణాసురిడితో పోరాడి గెలవడం వంటివి చూపిస్తారట. రెండవ భాగం లో శ్రీ రాముడు తనువు చాలించే వరకు ఆయన జీవిత చరిత్ర ని చూపిస్తారట.