Krithi Shetty
Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టిపై కొన్ని రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఒకింత ఆవేదన చెందారు. కృతి శెట్టి ఒకప్పటిలా లేదు. ఆమె అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై స్పందించిన కృతి శెట్టి… ఇలాంటి వార్తలు ఎవరు రాస్తారో అర్థం కాదు. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇవి విన్నప్పుడు బాధపడతారు. ప్రతి ఒక్కరిలో మార్పు చోటు చేసుకుంటాయి. ఉప్పెన మూవీలో ఉన్నట్లు ఇప్పుడు లేకపోవడానికి నాలో మార్పులు చోటుచేసుకొని ఉండొచ్చు. మేకప్, హెయిర్ స్టైల్ వలన కూడా భిన్నంగా కనిపిస్తాము. అంతే కానీ నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు, అన్నారు.
కృతి శెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా లేదా? అనే విషయం పక్కన పెడితే సాధారణంగా పరిశ్రమలో ఈ సాంప్రదాయం ఉంది. పెదాలు, ముక్కుతో పాటు బ్రెస్ట్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సమంత కెరీర్ బిగినింగ్ లో ఒకలా ఉండేవారు. ఆమె ఫేమ్ వచ్చాక సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది. దివంగత నటి శ్రీదేవి సైతం ముక్కు సర్జరీ చేయించుకున్నారని అంటారు. ఆమె వారసురాలు జాన్వీ కపూర్ టీనేజ్ లుక్ కి ప్రస్తుత లుక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
కొందరు హీరోయిన్స్ అందం కోసం సర్జరీలు చేయించుకున్నామని నేరుగా ఒప్పుకున్నారు. కొన్ని పరిశ్రమల్లో దీన్ని తప్పుగా చూడరు. కెరీర్లో భాగం అనుకుంటారు. కృతి శెట్టి మాత్రం తాను ఎలాంటి సర్జరీలకు పాల్పడలేదని వెల్లడించారు. ఇక ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. వరుసగా నాలుగు ప్లాప్స్ ఆమె తలుపుతట్టాయి. అరంగేట్రంలో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన కృతి శెట్టి… తర్వాత చతికిలపడింది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో కృతి హ్యాట్రిక్ పూర్తి చేశారు.
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు నిరాశపరిచాయి. ఆమె లేటెస్ట్ రిలీజ్ కస్టడీ డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. కనీస వసూళ్లు రాలేదు. పరిస్థితి చూస్తుంటే తెలుగులో కృతి కెరీర్ ముగిసినట్లే. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు మూవీ లేదు. ఓ తమిళ చిత్రంతో పాటు మరొక మలయాళ చిత్రం చేస్తున్నారు. శ్రీలీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది.