
Kiara Advani Pregnant: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా కియారా అద్వానీ కి ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికీ తెలిసిందే.తెలుగు లో ఈమె కేవలం ‘భరత్ అనే నేను’ మరియు ‘వినయ విధేయ రామ’ సినిమాలు మాత్రమే చేసింది.ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లో హీరోయిన్ గా చేస్తుంది.అయితే బాలీవుడ్ లో వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతూ అక్కడ తిరుగులేని స్టార్ గా ఎదిగిన కియారా అద్వానీ రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని పెళ్లాడింది.
Also Read: Amigos Collections: ‘బింబిసారా’ మొదటి రోజు వసూళ్లను 4 రోజులకు కూడా అందుకోలేకపోయిన ‘అమిగోస్’ చిత్రం
బందుమిత్రులు మరియు కొంతమంది సినీ ప్రముఖుల సమక్షం లో వీళ్లిద్దరి పెళ్లి ఎంతో వైభవం గా రాజస్థాన్ లో జరిగింది.సుమారు మూడేళ్ళ నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ లో ఉన్న ఈ జంట గురించి రీసెంట్ గా ఒక వార్త సోషల్ మీడియా లో బయటపడి వైరల్ గా మారింది.
అదేమిటంటే కియారా అద్వానీ కి పెళ్ళికి ముందే గర్భం దాల్చిందని, డేటింగ్ సమయం లోనే ఇది జరిగిందంటూ బాలీవుడ్ లో ఒక జోరుగా ప్రచారం సాగుతుంది.ఇటీవల కియారా అద్వానీ రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే హాస్పిటల్ లో డాక్టర్స్ రిపోర్ట్స్ ద్వారా ఈ విషయం బయటపడిందని తెలుస్తుంది.సోషల్ మీడియా లో తరుచూ యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న కియారా అద్వానీ బాలీవుడ్ లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై స్పందిస్తుందో లేదో చూడాలి.ఇది ఇలా ఉండగా పెళ్ళైన తర్వాత ఏ హీరోయిన్ కి అయినా క్రేజ్ బాగా తగ్గిపోతుందని అంటూ ఉంటారు, కానీ కియారా అద్వానీ చేతిలో ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి.

వాటిల్లో ఎక్కువ శాతం బాలీవుడ్ కి సంబంధించినవే అవ్వడం విశేషం.కానీ టాలీవుడ్ లో మాత్రం ఈమె కేవలం రామ్ చరణ్ – శంకర్ సినిమాలో మాత్రమే నటిస్తుంది.ఆఫర్స్ వెల్లువలాగా వస్తున్నప్పటికీ ఆమె డేట్స్ ని సర్దుబాటు చెయ్యలేకపోతుందట..కానీ టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఈమె నుండి ఎక్కువ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు.
Also Read:China Sperm Donation: బంపర్ ఆఫర్.. వీర్య దానం చేస్తే భారీగా డబ్బులు బహుమతి