K Ramp producer Rajesh: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో బాగా వినిపిస్తున్న పేరు ‘రాజేష్ దందా'(Rajesh Danda). ఈయన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘K ర్యాంప్'(K Ramp Movie) చిత్రానికి నిర్మాత. సోషల్ మీడియా లో తమ సినిమాపై వస్తున్నా నెగిటివ్ రివ్యూస్ పై ఈయన స్పందించిన తీరు ఎలా ఉన్నిందో మనమంతా చూసాము. డైరెక్ట్ గా బూతులు ఉపయోగిస్తూ, ఒక వెబ్ సైట్ ని నడుపుతున్న ఓనర్ ని తిట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ వీడియో నే కనిపిస్తుంది. చిన్న సినిమాలను అన్యాయంగా తొక్కేస్తున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా ఈయనకు మద్దతుగా నిలిచారు. వారిలో మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే గతం లో ఈయన పవన్ కళ్యాణ్ మీద వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనం గా మారింది.
వివరాల్లోకి వెళ్తే రాజేష్ దందా మొదటి నుండి బాలయ్య కి వీరాభిమాని. గతం లో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీసాడు. ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు, మరొకటి ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ మొదలయ్యే కొత్తల్లో ఒక మెగా అభిమాని ఆ సినిమా గురించి ట్వీట్ వేస్తూ ‘ఎన్టీఆర్ మహానాయకుడు లో నారా చంద్రబాబు నాయుడు క్యారక్టర్ ని రానా చేస్తున్నాడా?’ అని అడుగుతాడు. దానికి రాజేష్ దందా ‘కాదు..పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక సినీ నిర్మాత అయ్యుండి, సినిమాల్లో ఉంటూ, ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఇలాంటి కామెంట్స్ చేస్తావా?, ఇది చాలా అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నీకు మద్దతుగా నిలిచినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పావు అంటూ రాజేష్ దందా పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీనికి రాజేష్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ట్వీట్ ని కూడా డిలీట్ చేయలేదు. అసలు ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్ పెట్టాను అనేది కూడా వివరణ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో వివరణ ఇస్తాడో లేదో చూడాలి. అదే సమయం లో రాజేష్ కి సంబంధించిన మరో ట్వీట్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. టీడీపీ పార్టీ కి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు రాజేష్ ‘#WithPK’ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు కూడా వేసాడు. చూస్తుంటే ఇతను తెలుగు దేశం పార్టీ కి వ్యతిరేకస్తుడు లాగా అనిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్ అయ్యుండి టీడీపీ వ్యతిరేకంగా ఉండడం ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.