
టాలీవుడ్ హంక్ రానా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించడానికి ఎప్పుడూ వెనుకాడరు. ప్రస్తుతం ఆయన ‘అరణ్య’ సినిమాలో డీగ్లామర్ రోల్ చేస్తున్నది ఆ కారణం చేతనే. ఆ కథ, పాత్ర నచ్చి సినిమా చేశారు. అందుకే కొన్ని భిన్నమైన పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలో మలయాళ హిట్ మూవీ ‘అయ్యపనుమ్ కోషియుమ్’ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇందులో రెండవ ప్రధాన పాత్ర కోసం రానాను అనుకుంటున్నారు.
Also Read: మక్కికిమక్కి దించుతానంటే పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. రానా దాదాపు ఖాయమైనట్టేనని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. ఇక పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవికి కూడ రానాతో పని పడిందట. ఆయన కూడ మలయాళ హిట్ మూవీ ‘లూసిఫెర్’ను రీమేక్ చేస్తున్నారు. కొరటాలతో చేస్తున్న ‘ఆచార్య’ ముగియగానే ఆ ప్రాజెక్ట్ మొదలుకావొచ్చు. దీన్ని వివి.వినాయక్ డైరెక్ట్ చేయనున్నారు.
Also Read: మహేష్ ‘సర్కారీ వారి పాట’ అప్పుడే మొదలుకానుందా?
ఇందులో కూడ కొద్దిగా నిడివి ఉన్న ముఖ్యమైన పాత్ర ఒకటి ఉంది. ఇందులో రానాను తీసుకుంటే బాగుంటుందని, అతనైతేనే పాత్రకు న్యాయం జరుగుతుందని చిరు అండ్ టీమ్ భావిస్తున్నారట. అన్నీ కుదిరితే మెగాస్టార్ చిత్రంలో రానాను చూడోచ్చన్నమాట. మొత్తానికి అన్నదమ్ములిద్దరికీ రానాతో బాగానే అవసరం పడిందన్నమాట.