Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేశారా? జరిగింది ఇదే!

ఓట్లు వేసేందుకు ఊరు వాడ అంతా కలిసి పోలింగ్ బూత్ ల దగ్గర జనం పోటెత్తారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Written By: Suresh, Updated On : December 1, 2023 10:31 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: నవంబర్ 30న తెలంగాణలో ఎలక్షన్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారు ఎలా ఓట్లు వేస్తారు. అందులోనూ తెలంగాణకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వారు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారు. అని మీకు డౌట్ రావొచ్చు .. అయితే తెలంగాణలో ఉండే ఎవరైనా ఓటు హక్కు ఉపయోగించు కోవాల్సిందే. కాగా తెలంగాణ లో ఓట్ల పండుగ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ సమాప్తం అయ్యింది.

ఓట్లు వేసేందుకు ఊరు వాడ అంతా కలిసి పోలింగ్ బూత్ ల దగ్గర జనం పోటెత్తారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది ఉండగా .. వారు ఓటు హక్కు వినియోగించుకున్నారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శివాజీ, ప్రియాంక, యావర్, ప్రశాంత్, గౌతమ్, అర్జున్, శోభా శెట్టి, అమర్ దీప్ ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో తెలంగాణకు సంబంధించిన వారు ఇద్దరే ఇద్దరు .. ప్రశాంత్, గౌతమ్. గౌతమ్ ది సూర్య పేట కాగా ప్రశాంత్ ఊరు సిద్ధి పేట. యావర్ ది కలకత్తా.

శోభ శెట్టి, ప్రియాంకలు కర్ణాటకకు చెందినవారు. ప్రియాంక నార్త్ ఇండియన్ అయినా .. కర్ణాటక లో సెటిల్ అయింది. కాబట్టి వీరికి తెలంగాణలో ఓటు హక్కు ఉండకపోవచ్చు. మిగిలిన శివాజీ, అర్జున్, అమర్ ఏపీ వాళ్ళు. కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకి ఓటు హక్కు ఉండే అవకాశం లేదు. ఉన్న ఎనిమిది మందిలో గౌతమ్,ప్రశాంత్ లకు మాత్రమే తెలంగాణలో ఓటు ఉంది. అయితే ఈ ఎన్నికల్లో వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే లేనట్టే. బ్యాలెట్ ఓటింగ్ లో వీళ్ళకి ఓటు వేసే అవకాశం ఉండనే ఉండదు. దీని ప్రకారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనట్టే మరి.