Balakrishna-Prabhas: సినిమా ఇండస్ట్రీ లో బాలయ్య బాబు నందమూరి నటసింహాం గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక వాళ్ళ నాన్న స్ఫూర్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. మొదటి నుంచి కూడా వాళ్ల నాన్న ను ఫాలో అవుతూ వరుసగా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలు తనకంటూ స్టార్ డమ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఆయనకి లక్ష్మి నరసింహ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు వచ్చినట్టు భారీగా ఫ్లాప్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి 2010లో వచ్చిన సింహా సినిమా(Simha Movie) దాకా బాలయ్య బాబుకి ఒక్క హిట్టు కూడా లేదు.
దాంతో బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన సింహా సినిమాతో ఒక సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమా(Darling Movie) రిలీజ్ అయింది. అయితే సింహా సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో డార్లింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు అయితే దొరకలేదు. దాంతో డార్లింగ్ సినిమాని లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక సూపర్ హిట్ టాక్ వచ్చాక మిగతా కొన్ని థియేటర్లను కూడా పెంచారు.
అయినప్పటికీ బాలయ్య బాబు ప్రభంజనం ముందు ప్రభాస్ నిలబడలేక పోయాడనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య బాబు మాస్ యాక్షన్ సినిమా ముందు క్లాస్ యాక్షన్ ఫిల్మ్ నిలబడలేకపోయింది. బాలయ్య బాబు చాలా సంవత్సరాల తర్వాత సాలిడ్ హిట్ కొట్టడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటు, ఈ సినిమాని రిపీటెడ్ గా చూస్తూ సినిమా కలెక్షన్స్ ను పెంచే ప్రయత్నం అయితే చేశారు.
ఇక దీనివల్ల డార్లింగ్ సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా కొంతవరకైతే ఆ సినిమాకి చాలా దెబ్బ పడిందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో సినిమా చేసుకుంటూ ముందుకు కదులుతుంటే, ప్రభాస్ మాత్రం వరుసగా నాలుగు సినిమాలని లైన్ లో పెట్టి రెస్ట్ లేకుండా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది…