Balakrishna Bellamkonda Suresh: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహరమైతే కాదు. బయట నుంచి చూసేవాళ్లకు సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం గా కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఇక్కడి కష్టాలు కనబడుతుంటాయి. ప్రతి ఒక్కరికి క్షణమొక గండంగా గడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తినడానికి తిండి ఉండదు, చేతిలో పైసలు ఉండవు, పని చేద్దామన్నా పని ఇచ్చేవారు ఉండరు. అవకాశాల కోసం చాలా సంవత్సరాల పాటు ఎదురుచూసి వచ్చిన అవకాశాన్ని వాడుకొని ముందుకు సాగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే హీరోలు చాలా మంది ఉన్నారు. యంగ్ హీరోలు సైతం తమకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి చాలా మంది హీరోలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి నటసింహం బాలయ్య బాబు సైతం కెరియర్ మొదటి నుంచి కూడా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు…బాలయ్య ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. 2004 వ సంవత్సరంలో జయంత్ సి పరంజి దర్శకత్వంలో చేసిన ‘లక్ష్మీ నరసింహ’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.
అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ సినిమా థియేటర్లను పెంచే విషయంలో బాలయ్య బాబుకి తనకి మధ్య గొడవ జరిగి బాలయ్య తనని గన్నుతో కాల్చిన విషయం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది… ఇక అప్పట్నుంచి వీళ్ళ మధ్య మాటలైతే లేవు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్లిద్దరి మధ్య మాటలు కలిసాయని బెల్లంకొండ సురేష్ ఒక భారీ బడ్జెట్ తో బాలయ్య తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి… దీని మీద బాలయ్య గాని, బెల్లంకొండ సురేష్ గానీ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.
కానీ తొందరలోనే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే విషయం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు కలిసిపోయి మరోసారి మంచి సినిమా చేస్తే మాత్రం ఆ సినిమాను ఆదరించడానికి ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు…