Anil Ravipudi MSG success gift: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక ఈ సినిమా దర్శకుడు అయిన అనిల్ రావిపూడి సినిమాని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించినందుకు చిరంజీవి అతనికి రేంజ్ రోవర్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సైతం ఈ సినిమా సక్సెస్ కి కారణమైన తన రైటర్స్ టీమ్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన బహుమతిని కూడా ఇచ్చాడట. వాళ్లకిచ్చే సాలరీలో కొంతవరకు హైక్ చేసి మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చారట. అలాగే వాళ్లకు ఫారన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వాచ్ లను సైతం గిఫ్టుగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది…
ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి అపజయం ఎరుగని దర్శకుడిగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 9 సినిమాలను చేసిన ఆయన 9 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. రాజమౌళి తర్వాత వరుస సక్సెస్ లను సాధించిన దర్శకుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు.
ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో కామెడీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది అతని సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పటికి ఆయన వేటిని పట్టించుకోకుండా తన పరిధిలో తను సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
అందువల్లే అతనికి సక్సెస్ ఫుల్ సినిమాలైతే వస్తున్నాయి… ఇక ఇతర దర్శకుల మాదిరిగా పాన్ ఇండియా సినిమాలను చేయకపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమయ్యే సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. అందుకే అతనికి ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ఇక సీనియర్ హీరోలకి వరుస విజయాలను అందిస్తున్న సక్సెస్ మిషన్ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు…