Dhurandhar Box Office Collections: ఈ ఏడాది ఎండింగ్ ‘దురంధర్'(Dhurandhar Movie) రూపం లో బాక్స్ ఆఫీస్ కి సరికొత్త ఎనర్జీ వచ్చేలా చేసింది. ఏడాది ప్రారంభం లో విడుదలైన ‘చావా’ తప్ప ఒక్క కమర్షియల్ హిట్ కూడా బాలీవుడ్ లో లేదు అని అనుకుంటున్న సమయం లో వచ్చిన ఈ ‘దురంధర్’ చిత్రం ఆడియన్స్ నుండి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే సునామీ లాంటి వసూళ్లను బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోయింది ఈ చిత్రం. మొదటి రోజు వచ్చిన వసూళ్లు, ఇప్పుడు కూడా వస్తున్నాయి. అంతే కాదు నిన్న ఈ సినిమా కి అమ్ముడుపోయినంత టికెట్స్, నిన్ననే విడుదలైన ‘అవతార్ 3’ కి కూడా అమ్ముడుపోలేదట. ఆ రేంజ్ ట్రెండ్ తో ఈ సినిమా ట్రేడ్ పండితుల మతి పోగొడుతోంది.
వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే నిన్న ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజే ఇండియా వైడ్ గా 23 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. మూడవ శుక్రవారం ఈ రేంజ్ వసూళ్లు ఇప్పటి వరకు బాలీవుడ్ హిస్టరీ లో ఏ సినిమాకు కూడా రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రం తర్వాత మూడవ శుక్రవారం అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ‘చావా’ నిల్చింది. ఈ చిత్రానికి 13 కోట్ల 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో ‘పుష్ప 2’ చిత్రం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిల్చింది. ఇక చివరి స్థానం లో ‘బాహుబలి 2’ చిత్రం 10 కోట్ల రూపాయిల నెట్ తో కొనసాగుతుంది. ‘అవతార్ 3’ సినిమా రిలీజ్ ని ఎదురుగా పెట్టుకొని, ఈ చిత్రం నిన్న అంతటి నెట్ వసూళ్లను రాబట్టిందంటే సాధారణమైన విషయం కాదు.
అంతే కాకుండా నిన్నతో ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి, ప్రతిష్టాత్మకమైన బెంచ్ మార్క్ ని అందుకుంది. ఈ వీకెండ్ తో 600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కూడా ఈ చిత్రం అందుకోవచ్చు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ ప్రకారం చూస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 800 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ తో 900 కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని, వచ్చే వారం ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరబోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే, కేవలం సింగల్ లాంగ్వేజ్ ని వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా దురంధర్ సరికొత్త చరిత్ర నెలకొల్పనుంది.