Dhurandhar 2 Movie Vs Ustaad Bhagat Singh: ప్రేక్షకులు స్టార్ ని చూసి గుడ్డిగా టికెట్స్ థియేటర్స్ కి కదిలే రోజులు కాదు ఇది. కంటెంట్ లో కొత్తదనం ఉంటేనే కదులుతారు. ముఖ్యంగా సూపర్ స్టార్ స్థాయిలో ఉన్నోళ్లు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే అసలు సహించడం లేదు ఆడియన్స్. కనీసం ఓపెనింగ్స్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustad Bhagat Singh) ని చూసి అభిమానులు వణికిపోతున్నారు. ఎందుకంటే ఇదొక రొటీన్ కమర్షియల్ సినిమా. అది కూడా ‘ఓజీ’ లాంటి జెన్ Z సినిమా తర్వాత రాబోతున్న చిత్రం. ‘ఓజీ’ తర్వాత రాబోయే సినిమా, ఆ రేంజ్ హై స్టాండర్డ్స్ తో, అంతకు మించిన కంటెంట్ తో ఉండాలని అభిమానులతో పాటు, ట్రేడ్ కూడా ఆశిస్తుంది. అలాంటి అంచనాలు ఉన్న సమయంలో ఇలాంటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి రొటీన్ కమర్షియల్ సినిమాని ఎలా ఆదరిస్తారో అనే భయం ఫ్యాన్స్ లో ఉంది.
పైగా ఈ చిత్రం ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) విడుదలైన వారం రోజుల తర్వాత విడుదల కాబోతుంది. గత ఏడాది మార్చి 4 న విడుదలైన ‘ధురంధర్’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో మనమంతా చూసాము. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఓటీటీ లో రెండు రోజుల క్రితం విడుదలైంది. హిందీ, తెలుగు వెర్షన్ తో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే కి ఫిదా అయిపోయారు. ఇది కదా సినిమా అంటే అని సోషల్ మీడియా మొత్తం కామెంట్స్ తో నింపేశారు. ఈ రేంజ్ రీచ్ వచ్చింది కాబట్టి కచ్చితంగా ‘ధురంధర్ 2’ కి తెలుగు లో KGF చాప్టర్ 2 రేంజ్ హైప్ ఉంటుంది.
అంటే స్టార్ హీరో సినిమాకు ఏ మాత్రం తక్కువ లేకుండా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ చిత్రానికి మొదటి వారంలో ఒక రేంజ్ లో క్యూలు కట్టేస్తారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి కేవలం మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు మాత్రమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ మొత్తం ఉండేది యూత్ లోనే కాబట్టి, యూత్ ఆడియన్స్ సపోర్టు సహజంగానే ఉంటుంది. కానీ మొదటి వారం ధురంధర్ 2 ని ఎగబడి చూడడం వల్ల ఈ సినిమా పై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. పైగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఉంది. లేదంటే ధురంధర్ 2 ని తట్టుకోవడం చాలా కష్టం. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.