Dhurandhar 2 effect on Tollywood: తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ పై ‘ధురంధర్ 2’ ప్రభావం చాలా బలంగా పడిందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ సినిమా తర్వాతే మన టాలీవుడ్ మార్కెట్ ఓవర్సీస్ లో బాగా పడిపోయిందని కొందరి వాదన. ఎందుకంటే ‘ధురంధర్ 2’ లాంటి హై క్వాలిటీ చిత్రానికి టికెట్ రేట్స్ కేవలం 12 డాలర్లు మాత్రమే పెట్టారు , పైగా అందుకు ఫ్రీ పాసులు కూడా ఉన్నాయి , ఆ పాసులు ఉపయోగిస్తే కేవలం 5 డాలర్స్ కి ‘ధురంధర్ 2’ టికెట్ వచ్చేసింది. ఈ ప్రభావం , ఈ చిత్రానికి పోటీగా వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై చాలా బలంగా పడింది. ఒకపక్క ‘ధురంధర్ 2’ లాంటి క్రేజీ పాన్ ఇండియన్ సీక్వెల్ కి సంబంధించిన టికెట్స్ ని అంత తక్కువ రేట్ కి ఇస్తుంటే, ఒక మామూలు కమర్షియల్ సినిమా, పైగా రీమేక్ , అలాంటి చిత్రానికి 25 డాలర్లు పెట్టి ఎందుకు వెళ్ళాలి అనే భావన ఓవర్సీస్ ఆడియన్స్ లో కలిగింది.
అందుకే ఆ చిత్రానికి ఓవర్సీస్ నుండి కనీసం 5 లక్షల డాలర్ల ప్రీమియర్స్ గ్రాస్ కూడా రాలేదు . ఇది పవన్ కళ్యాణ్ కి చాలా అవమానకరంగా మారిన అంశం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటే రీమేక్ చిత్రం, రొటీన్ కమర్షియల్ , హైప్ కూడా లేదు కాబట్టి , నార్త్ అమెరికా మరియు ఓవర్సీస్ ఆడియన్స్ పట్టించుకోలేదు అనుకుందాం, కానీ ‘పెద్ది’ ఏమి పాపం చేసిందని నార్త్ అమెరికా లో అంతటి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి అనేది విశ్లేషకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. సినిమా విడుదలకు సరిగ్గా 8 రోజుల సమయం ఉంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 4 లక్షల 60 వేల డాలర్లు మాత్రమే వచ్చింది.
ఈ చిత్రానికి ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది , విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా బాంబు లాగా పేలింది. ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు స్టార్ హీరో సినిమాకు కనీసం 2 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ రావాలి, కానీ ‘పెద్ది’ చిత్రానికి ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే కనీసం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా వచ్చేలా లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అందుకు కారణం ‘ధురంధర్ 2’ అని , ఆ చిత్రానికి పెట్టినట్టుగానే , ఈ సినిమాకు కూడా టికెట్ రేట్స్ తక్కువ పెట్టాలని , అప్పుడు ఎవ్వరూ ఊహించనంత గ్రాస్ వస్తుందని అంటున్నారు. ‘ధురంధర్ 2’ చిత్రం ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ ని మార్చేసిందని , మన టాలీవుడ్ బయ్యర్స్ కూడా రాబోయే రోజుల్లో సినిమాలకు టికెట్ రేట్స్ బాగా తగ్గిస్తారని అంటున్నారు.
