Dhurandhar 2: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ తో దర్శకత్వ ప్రతిభ కి చిరునామా అంటే ఏంటో అర్థం అయ్యేలా చేశాడు డైరెక్టర్ ఆదిత్య డర్. స్టోరీ , స్క్రీన్ ప్లే , నటీనటుల అద్భుతమైన నటన , ఇవన్నీ టాప్ రేంజ్ లో ఉండడం వల్లే, ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇదంతా పక్కన పెడితే ‘ధురంధర్ 2’ లో డైరెక్టర్ ఆదిత్య డర్ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ని ఎంత బలహీనంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నవాడిగా అతన్ని చూపిస్తారు. అలా చూపించడం దావుద్ ఇబ్రహీం కి తీవ్రమైన ఆగ్రహాన్ని రప్పించాయని లేటెస్ట్ గా అందుతున్న వార్త. బాలీవుడ్ ని దావుద్ స్థాపించిన డీ కంపెనీ దశాబ్దాల నుండి ఏలుతూ వస్తోంది.
బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ , సూపర్ స్టార్స్ , నిర్మాతలు ఇలా అందరూ కూడా దావూద్ క్రింద పని చేస్తుంటారు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కూడా దావూద్ ఫండింగ్ చేసాడు. ఆయన ఏమి చెప్తే అది చేసేవాళ్ళు బాలీవుడ్. అలాంటి బాలీవుడ్ నుండి తనకు వ్యతిరేకంగా ఒక సినిమా రావడం పై డీ కంపెనీ తీవ్రమైన ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లో ఉంటూ దావూద్ ఇబ్రహీం ముంబై లో ఈ డీ కంపెనీ ని నడుపుతున్నాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక, దావూద్ ఇబ్రహీం ముంబై లో తన ముఠా కి సంబంధించిన నెట్వర్క్ మొత్తాన్ని యాక్టీవ్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ముంబై లో కొన్ని ఉగ్రదాడులు కూడా దావూద్ స్కెచ్ వేశాడట. ఈ ఉగ్ర కుట్రలో కొత్త సభ్యులను నియమించినట్టు తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియ నీవు షకీల్ ముఠాకి అప్పగించినట్టు తెలుస్తోంది.
వీళ్లకు పాకిస్థాన్ ISI శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం వంటివి చేయనుందట. అంతే కాకుండా ఈ ఉగ్ర ప్రణాళిక ను అమలు చేసే బాధ్యతను షూటర్ మున్నా జింగాడా కు అప్పటించినట్టు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాలు మాత్రం చెప్పలేదని విస్వసనీయ వర్గాల సమాచారం. ముంబైలో దావూద్ ఇబ్రహీం అంటే భయం పోయింది , తన మీద వ్యక్తిరేకంగా సినిమాలు చేసే స్థాయికి వెళ్లిపోయారు, వారిలో పోయిన భయాన్ని తిరిగి రప్పించాలంటే కచ్చితంగా మరోసారి ఉగ్ర దాడులు చెయ్యాలి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే ఇటీవలే ముంబై పోలీసులు ఈ ఉగ్ర ప్రణాళిక ని భగ్నం చేశారు , అదుపులోకి తీసుకున్న కీలక సభ్యుల నుండి ఈ సమాచారం మొత్తాన్ని బయటకు లాగారు. ఈ కుట్ర ప్రణాళిక లో కొంతమంది పరారీలో ఉన్నారు , వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.
