Dhee 20 Title Winner: ఈటీవీ లో జబర్దస్త్ షో తర్వాత అత్యధిక సంవత్సరాల నుండి ప్రసారం అవుతున్న షో ‘ఢీ’. ఇప్పటి వరకు 19 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ప్రస్తుతం 20 వ సీజన్(Dhee 20) ని జరుపుకుంటుంది. గడిచిన రెండు మూడు సీజన్స్ కంటే ఈ సీజన్ కి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. సంబంధం లేని పాటలకు సంబంధం లేని స్టెప్పులు, అనవసరమైన సర్కస్ ఫీట్స్ లేకుండా, స్వచ్ఛమైన డ్యాన్స్ తో ఈ షో ని నడుపుతున్నారు. ఈ సీజన్ లో పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. వారిలో టైటిల్ విన్నర్స్, టైటిల్ రన్నర్స్ కూడా ఉన్నారు. వీరిలో ప్రతీ ఒక్కరు దుమ్ము లేచిపోయే రేంజ్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పడం ఈసారికి కష్టం అయ్యేలా ఉంది.
గత వారం టికెట్ టు సెమీ ఫినాలే జరిగింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రాండ్ ఫినాలే లో ప్రస్తుతం టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే టైటిల్ రేస్ రాజు, పండు మాస్టర్, అభి మాస్టర్ మరియు భూమిక మధ్య ఉండొచ్చని అంటున్నారు. కానీ సోషల్ మీడియా లో ఆడియన్స్ అత్యధిక శాతం పండు మాస్టర్ టైటిల్ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఒక్క సీజన్ లో కూడా టైటిల్ గెలుచుకోలేదు. ఎంటర్టైన్మెంట్ + డ్యాన్స్ రెండు సమానంగా ఇస్తున్నప్పటికీ కూడా లక్ ఫ్యాక్టర్ కలిసిరాక మధ్యలోనే ఆగిపొతున్నాడు. ఈ సీజన్ అయితే డ్యాన్స్ ప్రతీ ఎపిసోడ్ లోనూ ఇరగదీస్తున్నాడు. కాబట్టి ఆయనకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఆ తర్వాత రాజు గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇతను తన ప్రతీ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని ఫినాలే లాగా ఊహించుకొని చేస్తుంటాడు. అందుకే జడ్జీల నుండి టాప్ స్కోర్స్ ని అందుకుంటూ ఉంటాడు. మామూలు ఎపిసోడ్స్ లోనే ఆ రేంజ్ డ్యాన్స్ చేసే రాజు, ఇక ఫినాలే కి ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడో ఊహించుకోవచ్చు. కాబట్టి ఇతను గెలుచుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక అభి మాస్టర్, భూమిక గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. వీళ్లిద్దరు కూడా ప్రతీ ఎపిసోడ్ లో షో స్టీలర్స్ గా నిలుస్తూ వస్తున్నారు. కాబట్టి వీళ్లిద్దరికీ కూడా సరిసమానమైన అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈసారి అదృష్టం ఎవరిని వరిస్తుంది అనేది. ఈసారి టైటిల్ విన్నర్ కి ట్రోఫీ తో పాటు పాతిక లక్షల రూపాయిల ప్రైజ్ మనీ కూడా అందనుంది.