Dhee 20 : ఈటీవీ లో ఎన్నో ఏళ్ళ నుండి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న షోస్ లో ఒకటి ‘ఢీ'(Dhee 20). ఇప్పటికి 19 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో, ఇప్పుడు 20 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇంతకు ముందు ఉన్న సీజన్స్ వేరు,ఇప్పుడు జరుగుతున్న సీజన్ వేరు. గతం లో ఈ ఢీ షో లో ఎక్కువగా సర్కస్ ఫీట్స్ ఉంటున్నాయి తప్ప, డ్యాన్స్ లేదు అనే విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం డ్యాన్స్ కి సరైన నిర్వచనం అనిపించేలా ప్రతీ ఒక్క కంటెస్టెంట్ పోటీ పడుతూ దుమ్ము లేపుతున్నారు. ఒకప్పుడు వచ్చే పాట ఏంటి?, వేస్తున్న డ్యాన్స్ ఏంటి సంబంధం లేకుండా అని అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం పాటకు తగ్గ డ్యాన్స్ ఉంటుంది,అప్పుడప్పుడు అద్భుతమైన స్కిట్ తరహా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లు కూడా ఉంటున్నాయి.
ఇకపోతే ఈ సీజన్ లో తోపు కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా రాజు ఉంటాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఒక ప్రోమో లో రాజు తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో దుమ్ము లేపేసాడు. నరసింహ స్వామి అవతారం లో స్కిట్ తరహా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చూసే ఆడియన్స్ కి మాత్రమే కాదు, అక్కడ షో లో ఉన్న కంటెస్టెంట్స్ కు, జడ్జీలకు కూడా అనిపించింది. విజయ్ బెన్నీ మాస్టర్ ఈ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతూ, నీలాంటి కంటెస్టెంట్స్ ఢీ షో లో కొనసాగుతూ వస్తే, ఎన్ని సీజన్స్ అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. కేవలం చిన్న ప్రోమో కట్ లోనే ఈ రేంజ్ లో ఉంటే, ఇక పూర్తి స్థాయి పెర్ఫార్మన్స్ చూస్తే ఆడియన్స్ కి ఏ రేంజ్ గూస్ బంప్స్ వస్తుందో తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. సోషల్ మీడియా లో ఒక ఊపు ఊపేస్తున్న ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.
