Dharmavarapu Subramanyam: ఆ చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయిన ధర్మవరపు సుబ్రమ్మణ్యం.. ఇంతకీ అదేంటో తెలుసా..?

ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్లు ఉన్నా కూడా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఉన్న పేరుగాని, ఆయన కామెడీ కి ఉన్న టైమింగ్ గాని మరే కమెడియన్ దగ్గర కూడా ఉండకపోవడంతో ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్ గా కూడా చాలా సంవత్సరాల పాటు కొనసాగారు. అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 2013లో లివర్ క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది.

Written By: Gopi, Updated On : October 24, 2023 5:19 pm
Follow us on

Dharmavarapu Subramanyam: అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హాస్య నటుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. ఈయన చేసిన చాలా పాత్రలు ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి.ఈ విధంగా ఈయన చేసిన ప్రతి సినిమాలో తనదైన మార్కు నటనని చూపిస్తూ ప్రేక్షకులను సైతం విశేషంగా అలరిస్తు తనకంటు అద్భుతమైన పేరు, ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. మూడు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీకి తనదైన సేవలను అందిస్తూ చూసే ప్రతి ప్రేక్షకుడికి కూడా తనదైన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల అందరి మదిలో చిరస్మరణీయంగా గుర్తుండిపోయాడు.

ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్లు ఉన్నా కూడా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఉన్న పేరుగాని, ఆయన కామెడీ కి ఉన్న టైమింగ్ గాని మరే కమెడియన్ దగ్గర కూడా ఉండకపోవడంతో ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్ గా కూడా చాలా సంవత్సరాల పాటు కొనసాగారు. అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 2013లో లివర్ క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది.

ఈయన చనిపోయిన తర్వాత కొడుకులు వాళ్ల నాన్న లేడని చాలా సంవత్సరాల పాటు తీవ్రమైన బాధలో ఉన్నారు. ఇక అందులో భాగంగానే వీళ్ళ పెద్ద కొడుకు అయిన సందీప్ వ్యాపార రంగంలో ఇప్పటికే స్థిరపడి పోయాడు. అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా తన చిన్న కొడుకు అయిన రవిబ్రహ్మతేజ ని ఇండస్ట్రీలో హీరో గా చూడాలని ముందు నుంచి కూడా చాలా ఆసక్తి చూపించే వారట…

తను చివరి స్టేజ్ లో కూడా తన కొడుకు అయిన రవి బ్రహ్మ తేజ సినిమా నటుడిగా ఎదగాలి నా పేరు నిలబెట్టాలి అంటూ ఆయన దగ్గర ఒక మాట కూడా తీసుకున్నట్టుగా రవి బ్రహ్మ తేజ ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో తెలియజేయడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు రవి బ్రహ్మ తేజ తన సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీ గా ఉన్నాడు.ఇక ఆయన హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం అంటూ చాలా వార్తలు కూడా వస్తున్నాయి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా వెలుగొందుతున్నప్పుడు ఆయనకి చాలా పోటీ ఎదురయ్యేది ఆ క్రమంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎవిఎస్ లాంటి దిగ్గజ నటులు పోటీలో ఉన్నప్పటికీ వాళ్ళకి సైతం పోటీ ఇస్తూ తను సపరేట్ గా కామెడీ ని పండిస్తూ ఎదగడం జరిగింది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసే కామెడీకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఆయన చేసిన కామెడీ గనక మనం చూసినట్లయితే విపరీతమైన బాధలో ఉన్న వాడికి కూడా తన మూతి మీద చిరునవ్వు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అంటే ఆయన కామెడీకి ఉన్న గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…