
Sir Collections : తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు లో నటించిన మొట్టమొదటి చిత్రం ‘సార్’ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. మంచి సినిమా తీస్తే తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు అని చెప్పడానికి మరో ఉదాహరణగా నిలిచింది ఈ సినిమా. రోజురోజుకి పెరుగుతున్న కలెక్షన్స్ ని చూస్తూ ఉంటే ధనుష్ ఇక టాలీవుడ్ లో స్థిరపడిపోవచ్చు కదా అని ట్రేడ్ పండితులు సైతం అంటున్నారు.
ఈ సినిమాకి ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నా వసూళ్లు తమిళనాడులో వస్తున్నా వసూళ్లకంటే ఎక్కువ ఉందట, ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారిన అంశం.కేవలం 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి మూడు రోజులకు కలిపి ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ కి ప్రీమియర్ షోస్ ట్రెండ్ ఊపందుకునేలా చేసిన చిత్రం ‘సార్’ అనే చెప్పొచ్చు. ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన టాక్ రావడంతో మొదటి రోజు ఈ సినిమాకి రెండు కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతీ ప్రాంతం లోను మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అలా రెండవ రోజు మొత్తం పూర్తి అయ్యేసరికి ఈ సినిమా దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిందట. ఇలా మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్ల రావడం అనేది చాలా తక్కువ సినిమాలకు మాత్రమే జరుగుతుంది.
ఆ జాబితాలోకి ‘సార్’ కూడా చేరిపోయింది.చాలా మంది తెలుగు హీరోలకు కూడా ఈ ఫీట్ సాధ్యపడలేదు.ఇక మూడవ రోజు ఆదివారం కావడం తో వసూళ్లు రెండవ రోజు కంటే ఎక్కువ రాబట్టిందట.అలా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టగా, ఓవర్సీస్ తెలుగు వెర్షన్ కలిపితే 11 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు.
