Dhanush Mrunal Thakur breakup: గత కొంతకాలం గా కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు , హాట్ టాపిక్ గా మారిన జంట ధనుష్ – మృణాల్ ఠాకూర్. వీళ్లిద్దరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని , లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే అధికారికంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని , ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అంతే కాదు , వీళ్లిద్దరు ప్రైవేట్ గా ఒక హోటల్ లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా లో లీక్ చేశారు. అయితే వీటిపై మృణాల్ ఠాకూర్ పలు సందర్భాల్లో స్పందించింది కూడా. తాను ధనుష్ ని ఒక బ్రదర్ లాగా భావిస్తానని, మా ఇద్దరి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే ఉందని , వ్యక్తిగత రిలేషన్ అసలు లేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఆ ఫోటోలను చూసి నెటిజెన్స్ అసలు నమ్మలేకపోయారు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే , వీళ్లిద్దరి మధ్య లవ్ బ్రేక్ అయ్యిందని , ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. అసలు మా మధ్య ఏమి లేదు బాబోయ్ అంటూ మృణాల్ ఠాకూర్ మొదటి నుండి చెప్పుకుంటూ వస్తుంటే , బాలీవుడ్ మీడియా వాళ్ళ మధ్య లవ్ రిలేషన్ షిప్ నడుస్తుందని పుకారు పుట్టించడం, వాళ్ళు పుట్టించిన పుకారు న్యూస్ కి ఇప్పుడు బ్రేకప్ అనే మరో పుకారు పుట్టించడం వంటివి చూసి అభిమానులు మీకు మీరే కొత్త ప్రపంచాలను క్రియేట్ చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో బాలీవుడ్ పై మండిపడుతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్, ధనుష్ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు , కానీ వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది అనేది మాత్రం నిజం. దాని గురించే మీడియా లో ఇంత చర్చ నడిచింది.
ఇక వీళ్లిద్దరి కెరీర్స్ విషయానికి వస్తే, ధనుష్ రీసెంట్ గానే ‘కారా’ అనే చిత్రాన్ని విడుదల చేసి , కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘ఓం’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి రీసెంట్ గానే ఆమె ‘డెకాయిట్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా బాలీవుడ్ లో ఆమె వరుణ్ ధావన్ , పూజ హెగ్డే లతో కలిసి ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై ‘ అనే చిత్రం చేసింది. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది.
