KA Paul Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ చేసినందుకు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు అవ్వాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. సుమారుగా 30 మందికి పైగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. కొద్దిరోజుల క్రితమే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ని విచారించిన పోలీసులు, నిన్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ని విచారించారు. సుమారుగా నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ విచారణలో ఈడీ అధికారులు ఏమి అడిగారో, దాని తాను సమాదానాలు చెప్పాడో విజయ్ దేవరకొండ మీడియా కి తెలిపాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు, కేవలం గేమింగ్ యాప్స్ ని మాత్రమే ప్రమోట్ చేసాను. అది లీగల్ గా చేయబడినది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ గేమింగ్ యాప్ అందుబాటులో ఉంది. మన తెలంగాణ లో ఆ యాప్ లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున..ఈసారైనా ఎన్టీఆర్ పై చెయ్యి సాధిస్తాడా?
ఈడీ అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు ఓపిగ్గా సమాదానాలు చెప్పానని, నా బ్యాన్క్ స్టేట్మెంట్స్ కూడా వాళ్లకు అందించానని చెప్పుకొచ్చాడు. ఎవరో కావాలని నాకే తెలియకుండా ఈ వివాదంలోకి నా పేరు తీసుకొచ్చారు అంటూ ఆయన చివర్లో మాట్లాడాడు. అయితే విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై ప్రజా శాంతి పార్టీ అధినేత KA పాల్(KA Paul) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండ తక్షణమే క్షమాపణలు చెప్పాలని, ఈ ప్రకటనల ద్వారా ఆయన సంపాదించిన లక్షల డబ్బులను, బెట్టింగ్ యాప్స్ ఆడి ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలకు ఇవ్వాలి అంటూ ఆయన డిమాండ్ చేశాడు. ఈరోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ తో ప్రతీ ఒక్కరు తిరుగుతున్నారు. వారిలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళు కూడా ఉన్నారు. సులువు దారుల్లో డబ్బులు వస్తున్నాయని ఆశ చూపితే వాళ్ళు చాలా తేలికగా వాటికి ఆకర్షితులై బెట్టింగ్ యాప్స్ ఆడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అంటూ KA పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: తండ్రి రాసిన మహేష్ కథను మరో రైటర్ తో మార్పిస్తున్న రాజమౌళి..?
విజయ్ దేవరకొండ కి నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను, ఈలోపు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేనిచో తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించాడు. మరి విజయ్ దేవరకొండ దీనికి రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. మరోవైపు విజయ్ దేవరకొండ వ్యాఖ్యలను సమర్దించేవాళ్ళు ఉన్నారు, అదే విధంగా తిట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. KA పాల్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని అత్యధిక శాతం మంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.