Dhanraj: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతలా ప్రాచుర్యం పొందిందో చూస్తున్నాం. బుల్లితెరలో కామెడీ షోగా జబర్దస్త్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన శైలిలో దూసుకుపోతూ రేటింగ్ పెంచుకుంది. ప్రతి గురు, శుక్రవారాలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయి. సీనియర్ టీం లీడర్లు షోను వీడి వెళ్లిపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోకు మునుపటి ప్రాధాన్యం రావడం లేదు.

హైపర్ ఆది జబర్దస్త్ ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లినా తరువాత కాలంలో అతడు షో నుంచి నిష్ర్ర్కమించడంతో రేటింగ్ క్రమంగా క్షీణిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జబర్దస్త్ కు పెద్దగా రేటింగ్ రావడం లేదు. దీనికి కారణం సీనియర్ టీం లీడర్లు వెళ్లిపోవడం కూడా ఒక కారణం. జబర్దస్త్ జడ్జిగా పనిచేసిన నాగబాబు టీం లీడర్ల పారితోషికం పెంచాలని కోరితే ఆయన్నే షో నుంచి వెళ్లిపోమని ఉచిత సలహా ఇవ్వడంతో ఆయన తన వెంట పలువురు టీం లీడర్లను తీసుకుని వెళ్లిపోయారు. అలాగే వండర్ వేణు, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ తదితరులు షో నుంచి బయటకు వెళ్లారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధన్ రాజ్ జబర్దస్త్ నుంచి బయటకు రావాల్సింది కాదని తన మనసులోని మాట వెళ్లగక్కాడు. వండర్ వేణు చొరవతోనే తాను జబర్దస్త్ ను వీడినట్లు చెప్పాడు. ఆనాడు వేణు మాట వినకపోతే జబర్దస్త్ లో మంచి స్థాయిలో ఉండేవాడినని బాధపడ్డాడు. ఇప్పటికి కూడా ధన్ రాజ్ వేణు పేరెత్తితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వేణు తీరుతో ఇప్పుడు ఎటు కాకుండా పోయాం. టీం లీడర్లుగా ఉన్న తాము మరో షోలో ఎంత చేసినా ఇక్కడ వచ్చినంత పేరు రాలేదని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారినట్లు వాపోయాడు. జబర్దస్త్ ను వీడి పెద్ద తప్పు చేశానని మదనపడుతున్నాడు. మేం బయటకు వచ్చాక సుడిగాలి సుధీర్ టీం లీడర్ అయ్యాడు. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు టీంగా ఏర్పడటంతో ఇక తాము వెళ్లినా వారిని విడదీసినట్లు అవుుతందని భావించి మళ్లీ జబర్దస్త్ లోకి రాలేకపోయాం. మొత్తానికి వేణు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకున్నాం. తప్పుడు సలహాలతో భవిష్యత్ ను నాశనం చేసుకున్నాం. జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చి చేసిన పనికి ధన్ రాజ్ విచారం వ్యక్తం చేస్తున్నాడు.