Devil Collections: డెవిల్ మూవీ వసూళ్లు అంచనాలు అందుకోలేదు. వీకెండ్, సెలవు దినాలను డెవిల్ క్యాష్ చేసుకోలేకపోయింది. నాలుగు రోజుల్లో డెవిల్ మూవీ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయలేదు. డిసెంబర్ 29న డెవిల్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా డెవిల్ తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలం నాటి సీక్రెట్ ఏజెంట్ రోల్ చేశాడు. డెవిల్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అయితే టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు.
మూడు రోజుల వీకెండ్ తో పాటు జనవరి 1న పాక్షిక సెలవు దినం లభించింది. దాంతో డెవిల్ కి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ దక్కింది. అయినప్పటికీ వసూళ్లపరంగా సత్తా చాటలేకపోయింది. నాలుగు రోజులకు నైజాంలో రూ.1.88 కోట్లు, సీడెడ్ రూ.88 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.50 లక్షలు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవిల్ మూవీ రూ. 4.70 కోట్ల షేర్, రూ. 9.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 50 లక్షలు, ఓవర్సీస్ రూ. 75 లక్షల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ డెవిల్ రూ. 5.95 కోట్ల షేర్, 12.10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక డెవిల్ ప్రీ రిలీజ్ బిజినెస్ గమనిస్తే… నైజాంలో రూ.5.50 కోట్లు, ఆంధ్రా లో రూ. 8 కోట్ల బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 20.10 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో డెవిల్ బరిలో దిగింది. మరి ట్రెండ్ చూస్తుంటే డెవిల్ గట్టెక్కేలా లేదు.
డెవిల్ మూవీ విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. నవీన్ మేడారం ఈ చిత్ర దర్శకుడు. మధ్యలో నిర్మాతలతో మనస్పర్థలు తలెత్తాయి. డెవిల్ మూవీ నుండి నవీన్ మేడారం ని తప్పించారు. దర్శకుడి క్రెడిట్ నిర్మాత అభిషేక్ నామా తీసుకున్నారు. నవీన్ నిర్మాతల మీద విమర్శలు చేశాడు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జంటగా సంయుక్త మీనన్ నటించింది.