Devara Song : ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర'(Devara Movie) మూవీ మేనియా ఇంకా తగ్గలేదు. గత ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించి దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్(Netflix) లో విడుదలైనప్పుడు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి ఇత్తర దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ రావడంతో ఈ సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. గ్లోబల్ వైడ్ గా మంచి రీచ్ రావడంతో ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఈ సినిమాని ముందుగా ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉన్నటువంటి జపాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రం జపాన్(Japan) దేశంలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Also Read : ఎన్టీఆర్ కి ఇది అసలైన పరీక్ష, మనోడి సత్తా తేలేది ఇప్పుడే , రజనీకాంత్ ని బీట్ చేస్తాడా?
ఎన్టీఆర్ కూడా జపాన్ లోని కొన్ని ప్రముఖ మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఆన్లైన్ ద్వారా ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని ‘దావుడి'(Daavudi Full Song) పాటని విడుదల సమయం లో ఎడిటింగ్ లో కట్ చేసి థియేటర్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఈ పాటని మళ్ళీ ప్రింట్స్ కి జత చేసారు. కేవలం ఈ పాట కారణంగా సినిమాకి మరికొంత థియేట్రికల్ రన్ పెరిగింది. ఇప్పుడు ఈ పాట జపాన్ దేశం మొత్తం మారుమోగిపోతుంది. రీసెంట్ గానే ఒక జపనీస్ జంట ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ ఒక రీల్ ని అప్లోడ్ చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రీల్ ని తమ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ చేసారు. మీరు కూడా ఆ వీడియో ని చూసేయండి.
కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా ఈ పాటకు అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేస్తున్నారు. రీసెంట్ గానే ఆహా మీడియా యాప్ లో మొదలైన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ లో ప్రముఖ యంగ్ హీరోయిన్ ఫైరా అబ్దుల్లా ఈ పాటకు అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలా అకస్మాత్తుగా నిన్నటి నుండి ‘దావుడి’ పాట సోషల్ మీడియా లో మారుమోగిపోతోంది. అంతే కాదు ఈ చిత్రం లోనే ఇంటర్వెల్ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తూ జపాన్ ఫ్యాన్స్ ఒక వీడియో ని చేయగా అది కూడా వైరల్ అయ్యింది. ఇదంతా చూస్తుంటే దేవర చిత్రం జపాన్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అనిపిస్తుంది. ప్రస్తుతం #RRR చిత్రం 2400 మిలియన్ జపనీస్ డాలర్స్ తో నెంబర్ 1 స్థానం లో ఉంది. ‘దేవర’ చిత్రం ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Also Read : నిద్ర లేని రాత్రులు గడుపుతున్న రామ్ చరణ్, జాన్వీ కపూర్..ఇదేమి డెడికేషన్ బాబోయ్!
No stoppage for #Devara mania
Japanese performing #Daavudi song ❤️@DevaraMovie#デーヴァラ@tarak9999 pic.twitter.com/wViQ908bXK
— (@NtrneelMode) March 11, 2025