Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ పై ఇండస్ట్రీ లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమా #RRR వంటి సంచలన విజయం తర్వాత విడుదల అవుతుందంటే అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తార స్థాయిలో ఉంటాయి. కానీ ఇటీవల విడుదలైన మూడవ పాట, థియేట్రికల్ ట్రైలర్ అభిమానులను కాస్త నిరాశపర్చాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తని చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి ఎన్టీఆర్ కి రాజమౌళి అత్యంత ఆప్త మిత్రుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఒకే తల్లి కడుపున పుట్టకపోయిన, ఇద్దరు అన్నదమ్ములు లాగానే ఉంటారు. రాజమౌళి ఎన్టీఆర్ మీద అభిమానంతో ఏకంగా నాలుగు సినిమాలు అతనితో కలిసి చేసాడు. అలా రాజమౌళి తో తనకి ఉన్న చనువుతో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి సంబంధించి ఒక చిన్న కోరిక కోరాడట. ఈ సినిమా ఫైనల్ కాపీ ని చూసిన తర్వాత ఏమైనా సన్నివేశాలు అవసరం లేకుంటే తొలిగించేందుకు సహాయ పడాలని, ఒక విధంగా చెప్పాలంటే ఎడిటింగ్ చేయించాలని రాజమౌళి ని ఎన్టీఆర్ కోరాడట.
అందుకు రాజమౌళి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో చేయబోతున్న సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ అడగగానే ఒప్పుకొని ఎడిటింగ్ దగ్గరుండి చేయించడానికి రాజమౌళి అంగీకారం తెలిపాడట. సినిమా సెన్సార్ అయ్యాక రన్ టైం 3 గంటల 10 నిమిషాలకు చేరుకుంది. అంత రన్ టైం సినిమాకి మంచిది కాదు అనేది ఎన్టీఆర్ అభిప్రాయం. ఇప్పటికే సినిమా కథకు అడ్డంగా ఉన్నట్టుగా భావించిన ‘దావూది’ సాంగ్ ని తొలగించినట్టు తెలుస్తుంది.
రోలింగ్ టైటిల్స్ అప్పుడు ఈ సాంగ్ ని పెడదామని ముందుగా అనుకున్నారట, కానీ ఎందుకో బాగాలేదు అనిపించి సినిమా నుండే పూర్తిగా తీసేశారట. ఇప్పుడు పూర్తి సినిమాని రాజమౌళి పర్యవేక్షణలో ఎడిటింగ్ చేయించి, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ పది రోజుల్లో చెయ్యిస్తారట. సినిమా అద్భుతంగా వచ్చిందని, చిరస్తాయిగా ప్రేక్షకుల మదిలో చిత్రం నిలిచిపోవాలంటే కచ్చితంగా రాజమౌళి లాంటోళ్ళ చెయ్యి పడాల్సిందే అని ఎన్టీఆర్ భావించినట్టు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహించాలని అనుకున్నారట. కానీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 22 వ తారీఖున హైదరాబాద్ లోని నోవెటల్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పీఆర్ టీం కాసేపటి క్రితమే చేసింది.