https://oktelugu.com/

Janhvi Kapoor: ప్రియుడితో కారులో దేవర హీరోయిన్ జాన్వీ కపూర్! మీడియా కంటపడటంతో!

శ్రీదేవి కూతురిగా ఆమెకు సౌత్ ఇండియాలో ఫేమ్ ఉంది. ఆమెను తెలుగు, తమిళ భాషల్లో నటింపజేయాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కిస్తున్నారు.

Written By: , Updated On : July 17, 2023 / 11:33 AM IST
Janhvi Kapoor

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి చిక్కారు. ఈ మేరకు ఓ వీడియో వైరల్ అవుతుంది. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె మోడల్ గా, నటిగా కొనసాగుతున్నారు. జాన్వీ కపూర్ కి నటిగా బ్రేక్ రాలేదు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా పెద్ద విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆమెకు ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ దక్కింది. దేవర హీరోయిన్ గా ఎంపికైంది.

శ్రీదేవి కూతురిగా ఆమెకు సౌత్ ఇండియాలో ఫేమ్ ఉంది. ఆమెను తెలుగు, తమిళ భాషల్లో నటింపజేయాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి జాన్వీ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. హీరోయిన్ కి కథలో కీలకమని దర్శకుడు కొరటాల చెప్పుకొచ్చారు. లంగాఓణీలో ఉన్న జాన్వీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తాత, జాన్వీ తల్లి శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేశారు. వారి వారసులు నటిస్తున్న మూవీపై హై ఏర్పడింది.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె ప్రియుడితో పాటు కారులో కనిపించారు. మీడియా వీరిని కెమెరాలలో బంధించింది. అతని పేరు శిఖర్ పహారియా అని తెలుస్తుంది. మీడియా చుట్టుముట్టడంతో జాన్వీ ముసిముసి నవ్వులు నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక గతంలో కూడా జాన్వీపై ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. కొత్తగా శిఖర్ పహారియా పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ లో ఇవన్నీ చాలా కామన్.