https://oktelugu.com/

Devara Collection : 5వ రోజు మళ్ళీ పుంజుకున్న ‘దేవర’ వసూళ్లు..అనేక ప్రాంతాలలో అదనపు షోస్..రేపు జాతరే!

ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం ఈ చిత్రానికి 5వ రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే కనుక నిజమైతే, రేపటి వసూళ్లు ఇంతకు రెండింతలు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 09:56 PM IST

    Heroine Mamita Baiju

    Follow us on

    Devara Collection :  ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో మైల్ స్టోన్ ని అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రారంభ షోస్ నుండి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత టాక్ పుంజుకోవడం తో వీకెండ్ మొత్తం అదిరిపోయే రేంజ్ వసూళ్లను నమోదు చేసింది ఈ చిత్రం. కేవలం 3 రోజుల్లోనే దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి దగ్గరగా వచ్చిన ఈ చిత్రం, నాల్గవ రోజు అన్ని ప్రాంతాలలో కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. కొన్ని చోట్ల మార్నింగ్ షోస్ ఫస్ట్ షోస్ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ సినిమా మళ్ళీ పైకి లేయడం కష్టమే, బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం నేడు ఫస్ట్ షోస్ నుండి హైదరాబాద్ వంటి సిటీస్ లో బాగా పుంజుకుంది.

    రేపు నేషనల్ లెవెల్ లో హాలిడే ఉండడం వల్ల ఈ ప్రభావం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే పక్క రోజు హాలిడే ఉన్న పెద్ద సినిమాలకు సాయంత్రం నుండి మంచి ఆక్యుపెన్సీలు ఉంటాయి. ఇది చాలా సినిమాలకు ట్రేడ్ విశ్లేషకులు గమనించారు. ఈ చిత్రానికి కూడా అదే విధమైన ట్రెండ్ కొనసాగింది. బుక్ మై షో యాప్ లో గంటకి 16 వేలకు పైగా టికెట్ అమ్ముడుపోయాయంటే, ఏ రేంజ్ ట్రెండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక రేపు బంపర్ వసూళ్లు రావడం పక్కా అని అంటున్నారు. ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం ఈ చిత్రానికి 5వ రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే కనుక నిజమైతే, రేపటి వసూళ్లు ఇంతకు రెండింతలు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా లేదా అని భయపడిన ట్రేడ్ కి ఈ చిత్రం రాబోయే వీకెండ్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది. అక్టోబర్ 3 వ తేదీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవలు కూడా మొదలు కానున్న ఈ నేపథ్యం లో మరో 10 రోజులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ రన్ కి అడ్డు ఉండదని, ఫుల్ రన్ లో 450 నుండి 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టబోతుందట. ఒక యావరేజి టాక్ వచ్చిన సినిమా ఈ రేంజ్ లో ఆడిందంటే, ఈ చిత్రానికి ఒకవేళా సూపర్ హిట్ టాక్ వచ్చునంటే ఏ రేంజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆచార్య లాంటి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తదుపరి సినిమాకి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే, అది కేవలం ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ స్టామినా వల్లనే అని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.