Sukumar : సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది సినిమాలను ఎలా తీయాలి. అందులో ఎలా నటించాలి అనే మేలుకువలు నేర్చుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు అనుకున్నది సాధించే దాకా అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. కొంతమంది మాత్రం ఎప్పుడూ వాళ్ళ టార్గెట్ మీద ఫోకస్ పెడుతూ అప్డేట్ అవుతూ ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు అయితే నచ్చుతున్నాయో అలాంటి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే సుకుమార్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతూ ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సుకుమార్ స్క్రీన్ ప్లే అందించి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగిన వీరూపాక్ష (Veerupaksha) సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క సీను కూడా ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన కార్తీక్ వర్మ దండు అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయనకి ఒక డిసీజ్ అయితే వచ్చిందట. ఇంకా ఆయనకు ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం తో బ్లడ్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యేది కాదట రాత్రికి రాత్రి ఆయనకు బ్లడ్ ఎక్కించడం సెలెన్స్ ఎక్కించడం లాంటివి చేసేవారట. దానివల్ల నైట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ డేలో ఆయన షూటింగ్ చేస్తూ వచ్చాడు.
Also Read : పవన్ కళ్యాణ్ ఒకే అంటే గ్యాంగ్ స్టర్ గా మారనున్న నాని…ఇదెక్కడి ఫిట్టింగ్…
ఇక ఒకనొక సమయం లో ఆయన హెల్త్ కండిషన్ ను బట్టి ఆయనకు బ్లడ్ జనరేట్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని డాక్టర్లు చెప్పడంతో కార్తీక్ దండు సుకుమార్ ని పిలిపించుకొని వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేద్దాం సార్ నేను బతికున్నప్పుడే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అంటూ కొన్ని ఎమోషనల్ మాటలైతే చెప్పారట.
దాంతో సుకుమార్ నీకేం కాదు అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వేం భయపడకు అంటూ అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చినప్పటికి ఆయన మాట్లాడిన మాటలకు సుకుమార్ కళ్ళల్లో సైతం నీళ్లు వచ్చాయట.
మరి ఏది ఏమైనా కూడా వీరూపాక్ష సినిమా తను అనుకున్నట్టుగా తీసి సక్సెస్ ని సాధించాడు. దాంతో పాటుగా హెల్త్ పరంగా కూడా ఆయన ఇప్పుడు రికవరీ అయ్యాడు. ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read : ‘కోర్ట్’ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన హీరో నాని..చూస్తే ఆశ్చర్యపోతారు!