spot_img
Homeఎంటర్టైన్మెంట్Deshmuduru Collections : 'దేశముదురు' రీ రిలీజ్ 2 రోజుల వసూళ్లు..బన్నీ రేంజ్ కి ఇది...

Deshmuduru Collections : ‘దేశముదురు’ రీ రిలీజ్ 2 రోజుల వసూళ్లు..బన్నీ రేంజ్ కి ఇది చాలా ఎక్కువే!

Deshmuduru Collections : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘దేశముదురు’ చిత్రం స్పెషల్ షోస్ ని నిన్నటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఈ చిత్రం రీ రిలీజ్ ట్రెండ్ లో డిజాస్టర్ అవుతుందేమో అని భయపడ్డారు కానీ, మొదటి రోజు షో టైం కి టికెట్స్ బాగానే తెగాయి.

అల్లు అర్జున్ కి టీనేజీ పిల్లల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని విశ్లేషకులు అంటుంటారు.నిన్న థియేటర్స్ వద్దకి వెళ్లి చూస్తే అది నిజమే అన్న విషయం అర్థం అవుతుంది.కొన్ని చోట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన సంబరాలు చూసి విశ్లేషకులు సైతం అష్క్యార్యపొయ్యారు.చాలా మంది స్టార్ హీరోలకు ఈ రేంజ్ లో ఈమధ్య థియేటర్స్ వద్ద సంబరాలు జరగలేదు.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ఉత్తరాంధ్ర లో 33 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.ఇది ఆ ప్రాంతం లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాలలో ఆల్ టైం రికార్డు అట.నైజం ప్రాంతం లో 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇది ఊహించిన దానికంటే ఎక్కువే అని చెప్పొచ్చు, అలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక రెండవ రోజు కొత్త సినిమాలు విడుదల అవ్వడం తో దేశముదురు గ్రాస్ బాగా తగ్గిపోయింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు కేవలం 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడం, 25 లక్షల రూపాయిల గ్రాస్ అదనంగా వస్తుందని అంటున్నారు.చూడాలి మరి దేశముదురు ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Oktelugu Epaper
Exit mobile version