Akkineni Nagarjuna : తెలుగు ఆడియన్స్ గత 8 ఏళ్ళ నుండి బిగ్ బాస్ రియాలిటీ షోకి ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకరికి ఒకరు తెలియని కంటెస్టెంట్స్ ఒక హౌస్ లో పెట్టి, వాళ్ళతో బిగ్ బాస్ ఆడించే ఆటలు, ఆ క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య ఏర్పడిన గొడవలు, రిలేషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఒక్కటా రెండా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపించే ఈ బిగ్ బాస్ రియాలిటీ స్టార్ మా ఛానల్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ఈ బిగ్ బాస్ సీజన్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత మూడవ సీజన్ నుండి 8వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
అయితే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. CPI నారాయణ వంటి వారు ఈ రియాలిటీ షో ని బ్యాన్ చెయ్యాలంటూ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ అంటే బ్రోతల్ హౌస్ తో సమానం అని, ఈ హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రవర్తించే తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా చేస్తుందని, అమ్మాయిలు అబ్బాయిలు అలా ఒకరినొకరు హగ్గులు చేసుకోవడం, కిస్సు లు చేసుకోవడం చూసే యూత్ ఆడియన్స్ ని చెడగొట్టేస్తుందని, ఒకే బెడ్ మీద అబ్బాయిలు, అమ్మాయిలు పడుకోవడం ఏమిటని, ఈ రియాలిటీ షో సమాజానికి హానికరం, తక్షణమే బ్యాన్ చెయ్యాలంటూ ఈయన అనేక సార్లు ఘాటుగా స్పందించాడు. అంతే కాదు అత్యంత ప్రజాధారణ ఉన్న నాగార్జున లాంటి స్టార్లు ఇలాంటి షోస్ చేయడం దురదృష్టకరమని ఆయన చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో నాగార్జున చూడనిది ఏమి మిగలలేదు. పెద్ద వయస్సులో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలాంటి అడల్ట్ రేటెడ్ షోకి ఎలా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు?, డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా అంటూ నాగార్జున పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అయితే సిపిఐ నారాయణ మాత్రమే కాదు, ప్రముఖ నిర్మాత చిట్టి బాబు కూడా గతంలో ఈ రియాలిటీ షో పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ షో మన తెలుగు ఆడియన్స్ ని చెడగొట్టే విధంగా ఉంటుందని, యూత్ ఆడియన్స్ ఈ షో ని చూసి చెడిపోతున్నారని, తక్షణమే ఈ షో ని బ్యాన్ చెయ్యాలంటూ వ్యాఖ్యానించాడు. ఇలా ఈ షోని ప్రతీ సీజన్ లో వీళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.