Deepthi Sunaina: బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె యూట్యూబ్ వీడియోలను మిలియన్స్ లో వీక్షిస్తారు. డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లులు ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో దీప్తి బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన దీప్తి మరింత ఫేమ్ రాబట్టారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. హౌస్లో 10 వారాలు ఉన్నారు. 70వ రోజు దీప్తి ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్లో టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. సింగర్ గీతా మాధురి, యాక్టర్ కౌశల్ ఫైనల్ లో పోటీపడ్డారు. టైటిల్ మాత్రం కౌశల్ కి దక్కింది.

బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన అనంతరం దీప్తికి ఆఫర్స్ పెరిగాయి. ఆమె వీడియోలకు ఆదరణ దక్కుతుంది. కాగా 2021లో దీప్తి తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పింది. ఏళ్ల తరబడి సాగిన వారి బంధానికి ముగింపు పలికింది. సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు తెలియజేశారు. ఇకపై తన పూర్తి దృష్టి కెరీర్ పై పెడతాను అన్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో సన్నిహితంగా ప్రవర్తించారు. ఈ కారణంగానే దీప్తి ప్రియుడితో విడిపోయారనే ప్రచారం జరిగింది.
దీప్తి-షణ్ముఖ్ విడిపోయి ఏడాది దాటిపోయింది. మెల్లగా ఇద్దరూ దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కలిసి ఈవెంట్స్ చేస్తున్న ఈ జంట ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. ముఖ్యంగా షణ్ముఖ్ మాజీ లవర్ తో రిలేషన్ పునరుద్ధరించుకోవాలి అనుకుంటున్నాడు. ఈ ఏడాది దీప్తికి బర్త్ డే విషెస్ కూడా చెప్పాడు. దీప్తి కూడా షణ్ముఖ్ పట్ల సానుకూలంగా ఉందట. ఏదో ఒకరోజు కాలిపోయామన్న ప్రకటన రావచ్చు అంటున్నారు.

విడిపోవడం వలన షణ్ముఖ్-దీప్తి ఆర్థికంగా కూడా నష్టపోయారు. వీరి కాంబినేషన్ కి మంచి డిమాండ్ ఉంది. షణ్ముఖ్ తో దీప్తి కలిసి చేసిన వెబ్ సిరీసులు, డాన్స్ నెంబర్స్ యూట్యూబ్ ని షేక్ చేశాయి. మళ్ళీ కలిసి వీడియోలు చేస్తే భారీగా డబ్బులు సంపాదించే వీలుంది. ఇదిలా ఉంటే… దీప్తి సోషల్ మీడియా పోస్ట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా దీప్తి జస్ట్ బ్రా అండ్ ప్యాంట్స్ ధరించి డాన్స్ చేశారు. బోల్డ్ స్టెప్స్ తో దీప్తి మంట పుట్టించింది. దీప్తి ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది.
View this post on Instagram