Deepthi Sunaina: దీప్తి సునయన.. ఈ పేరు గురించి సోషల్ మీడియా లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో ఈమె చాలా ఫేమస్ అయింది. ఈమె చేసే ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. మొదట్లో కవర్ సాంగ్స్ చేసే ఈ బ్యూటీ ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ వైపు మళ్ళింది. ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇలా యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక బిగ్ బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయిపోయింది. బిగ్ బాస్ తర్వాత పెద్ద షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె చేసే డాన్స్ వీడియోలు, రీల్స్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక షణ్ముక్ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు మరింతగా మార్మోగిపోయింది. షణ్ముక్ కూడా పెద్ద యూట్యూబ్ స్టార్ గా ఉన్నాడు. దాంతో అతని ద్వారా ఆమె చాలా ఫేమస్ అయిపోయింది.

Also Read: RRR కలెక్షన్స్ పై KGF చాప్టర్ 2 ఎఫెక్ట్.. ఆ ఒక్క ప్రాంతం నుండి భారీ నష్టాలు
ఇక బిగ్ బాస్ లో షణ్ముక్ ను గెలిపించడానికి ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కానీ ఏమైందో ఏమో.. షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో వారిద్దరి అభిమానులు షాక్ అయిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అసలైన కారణం ఏమిటో ఎవరూ చెప్పలేదు. హౌస్ లో షణ్ముక్ సిరి తో క్లోజ్ గా ఉండడాన్ని దీప్తి తట్టుకోలేక విడిపోయినట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇక బ్రేకప్ చెప్పాక దీప్తి తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది. రీసెంట్ గానే ఈ అమ్మడుకు ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చిందట. కానీ ఆ ఆఫర్ ను వద్దని చెప్పేసిందట.

ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె షేర్ చేసే ఘాటు ఫోటోలకు ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు. ప్రస్తుతం ఈమె రెడ్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో మతిపోగొట్టేసింది. జీన్స్ ప్యాంట్ వేసుకొని నడుము అందాలను చూపించేసింది. ఈ ఫోటోలో ఆమె చాలా హాట్ గా ఉంది. ఆమె ఫ్యాన్స్ ఈ ఫోటోలను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read: రంగం లోకి దిగిన కొరటాల శివ.. సర్కారు వారి పాట లో భారీ మార్పులు