Deepika Padukone: సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలని చాలా మంది అనుకుంటారు… కానీ ఇండస్ట్రీ లో ఒక్క అవకాశం రావడానికి ఎన్ని ఇబ్బందులు పడాలనే దాని గురించి ఎవ్వరు ఆలోచించరు… ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న నటులందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను భరిస్తూ, కన్నీళ్లను దిగమింగుతూ తిని తినక ఎన్నో రోజులు పస్తులుండి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఒక కోటను నిర్మించుకున్నారు. అలాంటి కష్టపడే తత్వం, ఎలాంటి ఇబ్బందులనైనా ఓర్చుకొని నిలబడి అనుకున్న దాన్ని సాధించగలమనే సంకల్పం ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు… ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే కెరియర్ స్టార్టింగ్ లో సినిమా అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు… ‘ఓం శాంతి ఓం’ సినిమాతో హీరోయిన్ గా మారి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు… ఆమె ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటికీ తనే టాప్ హీరోయిన్ గా వెలుగుందుతోంది అంటే ఆమె డెడికేషన్ కి మనం మెచ్చుకోవాలి… కానీ టాప్ పొజిషన్ వచ్చినంత మాత్రాన ఇక్కడ మనం చెప్పిందే నడుస్తోంది అనుకుంటే పొరపాటు…సినిమాల పరంగా ఎప్పటికప్పుడు ఒక వారియర్ లా పోరాటం చేయడం లో తప్పు లేదు.
కానీ మాకు క్రేజ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెడుతూ, భరించలేని కండిషన్లు పెడితే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు సహించరు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ‘దీపికా పదుకొనే’ పెట్టిన కండిషన్స్ శృతిమించి పోవడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి ఆమెను తీసేసాడు. ఇక రీసెంట్ గా ‘కల్కి 2’ మూవీ నుంచి కూడా ఆమెను తీసేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు…
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో సైతం దీపికా పదుకొనే హీరోయిన్ అంటూ మొదట ప్రకటించారు. అయినప్పటికి ఇప్పుడు ఆమెను ఆ సినిమా నుంచి కూడా తీసేసినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి… ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని కూడా తొందర్లోనే ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి…
సినిమా మేధావులు సైతం దీపికా పదుకొనే ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ప్రొడ్యూసర్లకు కండిషన్స్ పెట్టడం మానేసి డెడికేషన్ తో సినిమాలు చేసుకుంటే తన కెరియర్ మరో 10 సంవత్సరాల పాటు సాఫీగా సాగుతోంది. లేకపోతే మాత్రం అర్ధాంతరంగా తన కెరీర్ ముగిసి పోవాల్సిందే తప్ప ఏ స్టార్ హీరో కానీ, దర్శకుడు కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితులైతే లేవని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు…