Deepika Padukone: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దీపికా పదుకొనే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా అవతరించింది. కల్కి సినిమాతో సైతం మెప్పించిన ఆమె ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో భారీ క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తుండటం విశేషం…ఇక దాంతో పాటుగా ఆమె కొన్ని కండిషన్స్ కూడా పెడుతుందంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక వాటి వల్లే సందీప్ రెడ్డివంగ ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా విషయంలో ఆమె పెట్టిన కండిషన్స్ భరించ లేకుండా ఉన్నాయని అందువల్లే ఆమెను సినిమా నుంచి తప్పిస్తున్నాం అంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఇక అప్పట్లో ఈ విషయం పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ‘కల్కి 2’ సినిమా విషయంలోనూ దీపిక పదుకొనె ను పక్కకు పెట్టేస్తున్నామంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని అనౌన్స్ మెంట్ వచ్చింది… దాంతో ఒకసారి దీపిక పదుకొనే వార్తల్లో నిలిచింది. ఇక రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేసింది.
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ హీరో కూడా ఎనిమిది గంటల పాటు వర్క్ చేస్తారని హీరోయిన్లకు మాత్రం భారీ కండిషన్లు పెడుతూ ఉంటారని ఇండస్ట్రీలో ఉన్న మెయిల్ యాక్టర్స్ కి ఫిమేల్ యాక్టర్స్ కి చాలా తేడా ఉందని చెప్పారు… మహా అయితే హీరోలు వారాంతంలో కొన్ని గంటల పాటు పనిచేస్తారని లేడీ యాక్టర్స్ విషయంలో ఎక్కడా కూడా దయ చూపించారని, హీరోలు మాత్రం అన్ని విషయాల్లో వాళ్లకు నచ్చినట్టే ఉంటారని చెప్పారు.
ఈ ఎంటైర్ ఇంటర్వ్యూలో ఆమె ఎక్కడ కూడా ఏ స్టార్ హీరో పేరు కూడా చెప్పలేదు… ఇక ఇదిలా ఉంటే దీపిక భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందని పని గంటలు కూడా కేవలం ఆరు గంటలు మాత్రమే చేస్తానని చెబుతుందని ఆమె సిబ్బంది కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని వాళ్ళందరికి విపరీతమైన ఖర్చులు పెరిగిపోతున్నాయని అందువల్లే ఆమెని సినిమా నుంచి తప్పిస్తున్నామంటూ కొంతమంది దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ విషయాల మీద ఆమె పెద్దగా స్పందించకపోయినా కూడా ఆమె కొంతవరకు బ్యాడ్ అయిందనే చెప్పాలి. ఇక రాబోయే సినిమాలతో అయిన ఆమె బిహేవియర్ ను మార్చుకొని మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలి. అలాగే ప్రొడ్యూసర్స్ కి అదనపు భారం అవ్వకుండా ఉంటే చాలా మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…