Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా కూడా సక్సెసులు అయితే దక్కవు. ఇక మరి కొంతమంది మాత్రం వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ అయిన డిక పదుకొనే కూడా ఇప్పుడు వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఇండియాలో ఉన్న ఏ హీరోయిన్ల కి సాధ్యం కానీ రీతిలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్ గా కూడా గుర్తింపును సంపాదించుకుంది. ఇక 2023 లో షారుఖ్ ఖాన్ తో చేసిన పఠాన్, జవాన్ లాంటి రెండు సినిమాలతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన దీపిక ఈ సంవత్సరం ‘కల్కి ఏడి 2898’ సినిమాతో మరోసారి వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో పఠాన్, జవాన్, కల్కి, ఫైటర్ సినిమా తో కలుపుకొని 3600 కోట్ల కలెక్షన్లను రాబట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడు ఈ ఘటన సాధించిన మరొక హీరోయిన్ ఎవరూ లేరు. కాబట్టి దీపికా పదుకొనే కి భారీ క్రేజ్ దక్కుతుంది. ఆమె లాంటి నటీమని ఇండస్ట్రీలో మరొకరు లేరు అంటూ ఇప్పటికే ప్రశంసలను అందుకుంటున్న దీపిక ఈ ఫీట్ ని సాధించడం ఆమెకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది…
ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా తనను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆమె కనక ఆ సినిమాలో నటించినట్లైతే 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన మొదటి హీరోయిన్ గా కూడా ఆమె గుర్తింపును సంపాదించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్లు కాబట్టి 3000 కోట్ల దాకా కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించిందంటే మాత్రం ఆమె దశా దిశ మారినట్టే అని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఆమెలాంటి నటి ప్రస్తుతం ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది వాస్తవం…
ఇక ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు కూడా ఆమె చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చి ఆ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇక తొందరలోనే ఆమె డెలివరీ కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి సందర్భంలో ఆమె కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ కల్కి సినిమాకి సీక్వెల్, పటాన్ సినిమా సీక్వెల్లో ఆమె నటించాల్సిన అవసరం అయితే ఉంది.కాబట్టి ప్రస్తుతం రెస్ట్ తీసుకొని కొద్ది రోజుల తర్వాత ఆమె మళ్లీ సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
ఇక మొత్తానికైతే దీపిక ఇండియాలోనే ఏ హీరోయిన్ కి దక్కని ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి.ఇక దాంతో పాటుగా ఇప్పుడు చేయబోయే సినిమాలతో మరిన్ని క్రియేట్ చేయడానికి ఆమె రెడీ అవుతుంది అయితే ఇప్పుడు డెలివరీ అయిన కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో యాక్టివ్గా పాల్గొనడానికి ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ఆమె తన కాన్ఫిడెంట్ ని తెలియజేస్తుంది