ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ ప్రియులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో తన ఆటతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలోనూ అభిమానులను అలరిస్తున్నాడు. నిత్యం తనకు సంబంధించిన పిక్స్.. వీడియోలనూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న వార్నర్ ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలకుండా ప్రేమను చాటుకుంటున్నాడు. Also Read: విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ? కరోనా.. లాక్డౌన్ సమయంలో […]

Written By: NARESH, Updated On : November 28, 2020 8:41 pm
Follow us on

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ ప్రియులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో తన ఆటతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలోనూ అభిమానులను అలరిస్తున్నాడు. నిత్యం తనకు సంబంధించిన పిక్స్.. వీడియోలనూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న వార్నర్ ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలకుండా ప్రేమను చాటుకుంటున్నాడు.

Also Read: విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ?

కరోనా.. లాక్డౌన్ సమయంలో క్రికెట్ కు దూరమైన వార్నర్ టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరించాడు. ఇండియన్ సెలబ్రెటీల వీడియోలను వార్నర్ ఎక్కువగా చేస్తుండటంతో భారత్ లో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అతడి వీడియోలకు మంచి స్పందన లభిస్తుండటంతో వార్నర్ దానినే కంటిన్యూ చేస్తూ వెళుతున్నాడు. తాజాగా స్టేడియంలో వార్నర్ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ కు వార్నర్ గతంలో ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేయగా అదికాస్తా వైరల్ అయింది. దీని తర్వాత కూడా వార్నర్ బాలీవుడ్.. దక్షిణాది హీరోలను ఇమినేట్ చేస్తూ పలు వీడియోలు చేశాడు. అయితే శుక్రవారం సిడ్నీ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో ఆటతో ఆకట్టుకున్న వార్నర్.. ఫిల్డ్ సమయంలో బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read: బీసీ టైటిల్ తో ఎమోషనల్ మూవీ !

ఇక సిడ్నీ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగులతో విజయం సాధించింది. ఆస్టేలియా 374 పరుగుల చేయగా భారత్ 308 పరుగులకే పరిమితమైంది. ఆరోన్ పించ్ 114.. స్టీవ్ స్మిత్ 105, వార్నర్ 69 పరుగులతో రాణించారు. భారత్ ఇన్నింగ్స్ లో హార్ధిక్ పాండ్య 90, శిఖర్ దావన్ 74లు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఓటమితో ప్రారంభించింది. అయితే రెండో వన్డే మాత్రం ఆదివారం జరుగనుంది.

https://www.youtube.com/watch?v=0bqkkDPeaPw

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్