
నేషనల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత, తన 21వ సినిమాని ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ – దీపిక పదుకొణెల పాత్రలకి సంబంధించి కొత్త టాక్ మొదలైంది. ప్రభాస్ తో పాటు దీపికకి కూడా నేషనల్ వైడ్ క్రేజ్ ఉండటంతో.. సినిమాలో ప్రభాస్ పాత్రకు ఉన్నంత ఇంపార్టెన్స్, తన పాత్రకు కూడా ఉండాలని దీపిక మేకర్స్ కు షరతు పెట్టిందట.
Also Read: సంక్రాంతి రేసులో ‘అల్లుడు అదుర్స్’
కానీ, స్క్రిప్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ కు, సమానంగా దీపీక్ క్యారెక్టర్ కి స్కోప్ లేదని.. అమె పాత్ర కేవలం ఫస్ట్ హాఫ్ లో మాత్రమే ఉంటుందట. అందుకే దీపక తన పాత్ర పరిధిని పెంచాలని దర్శకుడికి సూచించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీపక పాత్రను పొగిడించే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ పాత్రకు తగ్గట్టుగానే దీపిక పాత్రను కూడా చివరి వరకూ ఉండేలా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాకి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి జనరేషన్ కూడా సింగీతం శ్రీనివాసరావు సినిమాలను బాగా ఇష్టపడతారు.
Also Read: టీజర్ టాక్: ‘చావుకబురు’తో చల్లగా చెప్పి రెచ్చిపోయిన కార్తీకేయ
అందుకే ఆయనను తమ సినిమాలో భాగం చేశారట వైజయంతి మూవీస్ వారు. కాగా ఈ సినిమా ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురావలనేది నిర్మాతలు ప్లానింగ్. దీన్నిబట్టి ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. పైగా నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా నాగ్ అశ్విన్ అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.