Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్ హోటల్ కు వెళ్లి భోజనం అడుగుతాడు. కానీ ఆ హోటల్ యజమాని కార్తీక్ తో వెటకారంగా పరువు తీసే విధంగా మాట్లాడుతాడు. అంతలోనే అక్కడున్న పనివాడు తను ఒక్కడే పనిచేస్తున్నాను అని కోపంతో విసిగెత్తుతాడు. ఆ మాట విని కార్తీక్ తాను ఈ పనిలో చేస్తాను అని ఒప్పందం తీసుకొని పిల్లలకు భోజనం తీసుకొని వెళ్తాడు.
ఇక ఆ హోటల్ యజమానికి తను తయారు చేసిన పిండి వంటలు రుచి చూపించడంతో ఆ యజమాని దీపకు కూడా పని ఇస్తాడు. కానీ దీప రుద్రాణి గురించి భయపడటంతో యజమాని రుద్రాణితో తనకు కూడా గొడవలు ఉన్నాయని చెప్పి ధైర్యం ఇస్తాడు. అంతలోనే అక్కడ్నుంచి కార్తీక్ రావడంతో అక్కడున్న పనివాడు కార్తీకును పక్కకు లాగి పనిలో చేర్పిస్తాడు. ఇక దీప యజమానికి సంతోషంగా ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కానీ కార్తీక్ ను చూడలేకపోతుంది.
ఇక మరోవైపు సౌందర్య, ఆనందరావు మనశ్శాంతి కోసం ఓ చోట కి రెడీ అయ్యి బయలు దేరుతారు. అది చూసిన మోనిత వీరు ఎక్కడికి వెళ్తున్నారని ఆలోచనలో పడుతుంది. కార్తీక్ జాడ గురించి తెలిసిందేమో అని వాళ్లని ఫాలో అవ్వడానికి రెడీగా ఉంటుంది. మొత్తానికి కార్తీక్, దీప ఓకే దగ్గర పని లో చేరడంతో కలిసి పని చేసి రుద్రాణి అప్పు తీరుస్తారో లేదో చూడాలి.