Bigg Boss 7 Telugu: టైటిల్ ఎవరిదో తేల్చుకోండి… హౌస్ మేట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్!

నెంబర్ 2 స్థానం కోసం పల్లవి ప్రశాంత్, ప్రియాంక పోటీ పడ్డారు. ఇక శోభా మూడో స్థానంలో నిలబడింది. అశ్విని, అమర్ దీప్ లు నెంబర్ 4 లో నిలబడ్డారు. కాగా రతిక నేను టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నా అందుకే నేను నెంబర్ ఫైవ్ అనుకుంటున్నాను అని చెప్పింది.

Written By: NARESH, Updated On : November 15, 2023 4:04 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాగా ప్రశాంత్, శివాజీ తప్ప మిగిలిన ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే పది వారాల ఆట పూర్తయింది. ఇక మిగిలింది ఐదు వారాలు మాత్రమే. దీంతో ఎవరి స్థానం ఏంటో తేల్చుకుని మీరు ఏ స్థానంలో ఉండాలని అనుకుంటున్నారో.. ఆ స్థానంలో నిలబడాలని బిగ్ బాస్ చెప్పారు. కాగా నెంబర్ 1 స్థానం కోసం శివాజీ, గౌతమ్, యావర్, అర్జున్ లు పోటీ పడ్డారు.

నెంబర్ 2 స్థానం కోసం పల్లవి ప్రశాంత్, ప్రియాంక పోటీ పడ్డారు. ఇక శోభా మూడో స్థానంలో నిలబడింది. అశ్విని, అమర్ దీప్ లు నెంబర్ 4 లో నిలబడ్డారు. కాగా రతిక నేను టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నా అందుకే నేను నెంబర్ ఫైవ్ అనుకుంటున్నాను అని చెప్పింది. ఏకాభిప్రాయంతో ఇంటి సభ్యులు రతికని పదో స్థానానికి నెట్టేశారు. నేను టెన్త్ ప్లేస్ కాదు అంటూ రతిక వాదించింది. ఇది హౌస్ నిర్ణయం అని శివాజీ చెప్పడంతో .. చేసేదేమి లేక వెళ్లి నెంబర్ 10 లో నిలబడింది రతిక.

తర్వాత అమర్ దీప్ ‘ నా స్థానం నెంబర్ వన్ .. అది నాదే అని మరీ మరీ చెప్తున్నా’ .. అంటూ ఆరో నెంబర్ లో నిలబడ్డాడు. ‘ సిక్స్త్ పొజిషన్ లో ఉందామనుకున్న .. అది వెళ్లిపోయింది’ అని రతిక అంటే .. గోడ మీద పిల్లిలా సమాధానాలు చెప్పకు అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకర్నొకరు తిట్టుకున్నారు.

తర్వాత శోభా ఏడో స్థానం ఇవ్వడంతో .. నాకు సెవెంత్ ప్లేస్ ఏంట్రా .. నాకు లక్ ఫేవర్ చేసిందంట .. నేను స్పైసీ చికెన్ తిని ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు .. అంటూ ప్రియాంక, అమర్ ల తో చెప్పుకుని ఏడ్చేసింది శోభ శెట్టి. బిగ్ బాస్ పెట్టిన ఫిట్టింగ్ కి కంటెస్టెంట్స్ మధ్య రచ్చ లేచింది. నేను నంబర్ వన్ అంటే నేను అంటూ తెగ వాదించుకున్నారు.