Pawan Fans vs Mahesh fans: ఈ ఏడాది ముగింపు సినీ అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా ఉండబోతుందా?, థియేటర్స్ మొత్తం బ్లాస్ట్ అవబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రీ రిలీజ్ ట్రెండ్ లో కింగ్స్ గా పిలవబడుతున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) సూపర్ హిట్ చిత్రాలు ఆరోజున విడుదల అవ్వబోతున్నాయి కాబట్టి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ లాగా నిల్చిపోయిన జల్సా(Jalsa Movie) చిత్రం, అదే విధంగా మహేష్ బాబు ని హీరో గా నిలబెట్టిన ‘మురారి'(Murari Movie) చిత్రం డిసెంబర్ 31 న విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసేసారు నిర్వాహకులు. ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఒకసారి రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పాయి. 2022 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా మూవీ స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేశారు ఫ్యాన్స్.
ఈ స్పెషల్ షోస్ కి దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు. ఇక ఆ తర్వాత గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘మురారి’ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఫుల్ రన్ లో పది కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇలా ప్రత్యేకంగా ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి. అలాంటి సినిమాలు ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ అవ్వబోతుండడం తో ఇద్దరి హీరోల అభిమానుల్లో ఉత్సాహం మామూలు రేంజ్ లో రాలేదు. చూసుకుందాం మీ హీరోనా?, లేదా మా హీరోనా?, రీ రిలీజ్ ట్రెండ్ కింగ్ ఎవరో ఈ దెబ్బతో తేలిపోతుంది అంటూ మహేష్, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సవాళ్లు విసురుకుంటున్నారు.
ఒక్కసారి ఊహించుకోండి, హైదరాబాద్ లోని సంధ్య 70 MM థియేటర్ లో జల్సా, సంధ్య 35 MM థియేటర్ లో మురారి చిత్రాలు ప్రదర్శితం అవుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. అదే విధంగా సుదర్శన్ 35 MM లో మురారి, దేవి 70 MM లో జల్సా లను కూడా ఊహించుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కంప్లెక్స్ థియేటర్స్ లో ఈ రెండు సినిమాలు ప్రదర్శితం అవుతున్నప్పుడు అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయం గా ఉంది. ఇక విడుదలయ్యాక పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. వచ్చే వారం ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.