Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan : మేధావి వర్గాల్లో పవన్ పై చర్చ !

Pawan Kalyan : మేధావి వర్గాల్లో పవన్ పై చర్చ !

Pawan KalyanPawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఆయన సినిమాల నుండి వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. మరోపక్క పవన్ ఫ్యాన్స్ పవన్ పుట్టినరోజు వేడుకల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే, పవన్ రాజకీయంగా ఎదగాలి అంటే.. ఏమి చేయాలి ? ప్రస్తుతం ఈ టాపిక్ పైనే ఓ మేధావి వర్గం సోషల్ మీడియాలో చర్చ పెట్టింది. ఆ చర్చల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు.

మొదట పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని సినీ పరిశ్రమ లాగా భావించడం మానుకోవాలి అనేది వారి అభిప్రాయం. అయినా, సినిమాకి రాజకీయానికి తేడా పవన్ కళ్యాణ్ కంటే.. ఇక ఎవరికీ ఎక్కువ తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఈ రెండిటిని అనుభవించి కష్టనష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే మరో అంశం.. మంచో చెడో ఏదో ఒక దానికి తను కట్టుబడాలి. అసలు పవన్ అంటేనే మాట మీద నిలబడే వ్యక్తి కదా. ఇది ఎలా మర్చిపోయారో !

అన్నట్టు మరో విషయం గురించి కూడా ప్రముఖంగా మాట్లాడారు. అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని యత్నంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తులు తరచుగా మారుస్తూ ఉంటారు అని. పవన్ నిజంగానే లాభాలు కోసం పొత్తు పెట్టుకుంటే.. 2014లోనే టీడీపీ నుండి పదవులు పొందేవారు కదా. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. పిలిచి పదవి ఇస్తాం అన్నా.. పవన్ తీసుకోలేదు. అది కదా పవన్ అంటే.

ఇక మేధావి వర్గం చెప్పిన మరో పాయింట్.. పవన్ గతంలో అనుభవించిన రాజకీయ వైఫల్యం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. పవన్ చెప్పే ప్రతి స్పీచ్ లో ఆ పరిణితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయంలో ఓపిక చాలా ముఖ్యం. చిన్న మాట ఆడాలన్నా ఆచితూచి మట్లాడాలి. మిత్రులను దగ్గరగా, శత్రువులను ఇంకా దగ్గరగా ఉంచుకోవాలి. ఈ పాయింట్స్ ను పవన్ తనను తానూ సరిచేసుకోవచ్చు.

అలాగే ఒక రాజకీయ నాయకుడికి నిర్ధిష్ట లక్ష్యంతో పాటు పక్కా ప్రణాలికాబధ్ధమైన వ్యూహం ఉండడం చాలా అవసరం. ఈ విషయంలో కూడా పవన్ ఒకసారి సరిచూసుకుంటే మంచిది. అలాగే అభిమానులను ఓటు బ్యాంకుగా మార్చుకునే విషయంలో పవన్ ఇప్పటినుంచే కొత్త పద్ధతులు ఫాలో అయితే పార్టీకి చాలా మేలు జరుగుతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version