https://oktelugu.com/

కరోనాలోనూ మెగాస్టార్ పారితోషికంపైనే చర్చ..!

మెగాస్టార్ రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ‘ఖైదీ-150’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా తగ్గలేదని చిరంజీవి నిరూపించారు. ఆ తర్వాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’లో నటించాడు. సైరా నర్సింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారని విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. Also Read: వెంకీ – వరుణ్ ‘ఎఫ్ 3’కి ముహూర్తం ఖరారు ! చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 11:58 AM IST
    Follow us on

    మెగాస్టార్ రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ‘ఖైదీ-150’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా తగ్గలేదని చిరంజీవి నిరూపించారు. ఆ తర్వాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’లో నటించాడు. సైరా నర్సింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారని విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు.

    Also Read: వెంకీ – వరుణ్ ‘ఎఫ్ 3’కి ముహూర్తం ఖరారు !

    చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ షూటింగ్ ప్రారంభిస్తున్న సమయంలోనే చిరంజీవి కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఆ తర్వాత ఫల్స్ కిట్ వల్ల కరోనా పాజిటివ్ వచ్చిందని తేలడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

    ఆచార్య తర్వాత చిరంజీవి వేదాళం రీమేక్ లో నటించనున్నాడు. దర్శకుడు మోహర్ రమేష్ ‘వేదాళం’ రీమేక్ తెరకెక్కించున్నాడు. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా దర్శకుడు కథలో కొన్నిమార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ ఉండగానే వేదాళం కోసం చిరంజీవి తీసుకుంటున్న పారితోషికంపై టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

    Also Read: పాయ‌ల్ రాజ్ పుత్.. అన‌గ‌న‌గా ఓ అతిధి

    చిరంజీవి ‘ఆచార్య’ కోసం 50కోట్ల పారితోషికం తీసుకుంటుగా ‘వేదాళం’ కోసం 60కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ విన్పిస్తోంది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే చిరంజీవి పారితోషికంపై చర్చ జరుగుతుండటం గమనార్హం. వేదాళం మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్స్ జరుగలేదని తెలుస్తోంది.

    చిరంజీవికి నిర్మాతల మధ్య పారితోషికం విషయంలో ఎలాంటి బేరసారాలు జరుగలేదని తెలుస్తోంది. ‘ఆచార్య’ పూర్తయితేగానీ వేదాళం రీమేక్ పట్టాలెక్కదని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఫోకస్ అంతా ‘ఆచార్య’పైనే ఉంది. దీంతో వేదాళం కోసం చిరంజీవి 60కోట్ల పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలో నిజం లేదనే టాక్ విన్పిస్తోంది. వేదాళం షూటింగ్ ప్రారంభమయ్యే నాటికిగానీ చిరంజీవి పారితోషికంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్