Aadhya: రెండు దశాబ్దాల అనంతరం రేణూ దేశాయ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్ర చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం. 70లలో దేశాన్ని వణికించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ స్ఫూర్తిగా రూపొందింది. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రేణు దేశాయ్ తన రీ ఎంట్రీ, టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో పాత్ర గురించి పలు విషయాలు వెల్లడించారు. కావాలని సినిమాల నుండి గ్యాప్ తీసుకోలేదన్న రేణు దేశాయ్… ఓ చిత్రాన్ని ఎంచుకునే క్రమంలో కథ, దర్శకుడు, నిర్మాత ఎవరనే విషయాలు పరిగణలోకి తీసుకుంటాను. ఈ మూడు విషయాల్లో సంతృప్తి చెంది చేసిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.
ఈ చిత్రంలో నేను హేమలత లవణం అనే పాత్ర చేస్తున్నాను. 70లలో ఆమె సామాజిక కార్యకర్త. జోగిని వ్యవస్థ, అంటరానితనం వంటి సామాజిక దురాచారాల మీద ఆమె పోరాడారు. హేమలత మేనకోడలు కీర్తిని కలిసి ఆమె గురించి అనేక విషయాలు తెలుసుకున్నాను. హేమలత లవణం పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. నేను ఈ చిత్రంలో వయసుకు తగ్గ పాత్ర చేశాను. అందుకు ఆద్య సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి పాత్ర చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉందని ఆద్య అంది.
ఆద్య కామెంట్ నాకు పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పాలి, అన్నారు. ఈ సందర్భంగా తన అనారోగ్య సమస్యల గురించి కూడా రేణు స్పందించారు. మా నాన్నమ్మ 47 ఏళ్లకే గుండెపోటుతో చనిపోయింది. మా నాన్న కూడా హార్ట్ అటాక్ కారణం కన్నుమూశారు. నాకు హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయి. అయితే ప్రమాదం లేదు. అయితే జాగ్రత్తగా ఉండాలని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.