Orenge Re-Release : ‘ఆరెంజ్’ రీ రిలీజ్ మేనియా లో కొట్టుకుపోయిన ‘దాస్ కా ధమ్కీ’..బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనా?

Orenge Re-Release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన డిజాస్టర్ చిత్రం ‘ఆరెంజ్’ ని ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్ననే రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోస్ గా వేసిన సంగతి తెలిసిందే.ఈ షోస్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.అభిమానులు కలలో కూడా ఊహించని ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి. మొదటి రోజు అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా సుమారుగా కోటి 60 లక్షల రూపాయిల […]

Written By: NARESH, Updated On : March 27, 2023 9:39 pm
Follow us on

Orenge Re-Release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన డిజాస్టర్ చిత్రం ‘ఆరెంజ్’ ని ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్ననే రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోస్ గా వేసిన సంగతి తెలిసిందే.ఈ షోస్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.అభిమానులు కలలో కూడా ఊహించని ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి.

మొదటి రోజు అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా సుమారుగా కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఒక డిజాస్టర్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే మొదటిసారి.మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం దాటికి కొత్తగా విడుదలైన విశ్వక్ సేన్ ‘మాస్ కా ధమ్కీ’ మరియు కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ సినిమాలు తట్టుకోలేకపోయాను.వీకెండ్ కి ఈ రెండు చిత్రాలు బ్రేక్ ఈవెన్ మార్కుని దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.

కానీ ఆడియన్స్ మొత్తం ‘ఆరెంజ్’ సినిమాకి క్యూలు కట్టేయడం తో ఈ రెండు చిత్రాలను పట్టించుకున్న వాళ్ళే లేరు.విడుదలైన రోజు నుండి వీకెండ్ పూర్తి అయ్యే వరకు ‘దాస్ కా ధమ్కీ’ చిత్రానికి కనీసం కోటి రూపాయిల షేర్ కూడా రాలేదట.బంపర్ ఓపెనింగ్ ని దక్కించుకొని రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకున్న ఈ సినిమా,రెండవ రోజు వసూళ్లు దారుణంగా పడిపొయ్యేసరికి కనీసం వీకెండ్ తోనే అయినా బ్రేక్ ఈవెన్ మార్కుని చేరుకుంటుందని అనుకున్నారు.

వీకెండ్ మీద బయ్యర్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.వారి ఆశలపై ఆరెంజ్ సినిమా నీళ్లు చల్లింది.ఇక రెండవ రోజు ఆరెంజ్ కి వస్తున్నా వసూళ్ళలో కనీసం పావు శాతం కూడా రాబట్టలేకపోయింది అట దాస్ కా ధమ్కీ.ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 50 లక్షలు రావాలి.’దసరా’ సినిమా వచ్చేలోపు ఇది రాబట్టాల్సి ఉంటుంది.