HBD Vijay Devarakonda: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చే ప్రతీ ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి ఒక ఆదర్శం. ఆయనని ఆదర్శంగా తీసుకొని నేటి తరం హీరోలలో రవితేజ, నాని వంటి వారు సక్సెస్ అయ్యారు. వాళ్లకి ఒక హోదా రావడానికి చాలా సమయమే పట్టింది, కానీ విజయ్ దేవరకొండ కి మాత్రం చాలా తక్కువ సమయం పట్టింది.
నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ద్వారా సపోర్టింగ్ రోల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా విజయ్ దేవరకొండ , ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమా తో హీరో గా మొదటి సక్సెస్ ని అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన ‘అర్జున్ రెడ్డి’ అనే చిత్రం లో యూత్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు,ఆ తర్వాత విడుదలైన ‘గీత గోవిందం’ అనే చిత్రం సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా చెక్కు చెదరని క్రేజ్ ని విజయ్ దేవరకొండ కి తెచ్చి పెట్టింది.
అయితే విజయ్ దేవరకొండ కి ఏది అంత సులువుగా రాలేదు.సినిమాల్లో సెలెక్ట్ అవ్వడానికి ఆయన అప్పట్లో ఒక యుద్ధమే చేసాడు, అలా ఒకరోజు శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు, ఆయన తెరకెక్కించబోయే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించాడు, ఆ తర్వాత రవిబాబు తెరకెక్కించిన ‘నచ్చావులే’ అనే సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు.ఆడిషన్స్ సమయం లో ఈయన చేసిన యాక్టింగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నది.
ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన విజయ్ దేవరకొండ కి ఇండస్ట్రీ కి రాకముందే కాదు, ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు కూడా ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి, లైగర్ సినిమా సమయం డబ్బులు రొటేషన్ అవ్వడం ఆగిపోయి చాలా ఇబ్బంది పడ్డాడట. లాక్ డౌన్ ఎత్తేసిన సమయం లో షూటింగ్ కి వెళ్లేందుకు కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదట.అంత పెద్ద క్రేజీ హీరో కి ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతాయా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎవరి కష్టాలు వారివి అని ఊరికే అన్నారు పెద్దోళ్ళు, కాబట్టి చూసేవి అన్నీ నిజాలు కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి.