Dance Icon 2 Show : బుల్లితెర ని ఎక్కువగా వీక్షించే వారికి పరిచయం అక్కర్లేని పేర్లు అమర్ దీప్ చౌదరి(Amardeep Chowdary), ప్రేరణ(Prerana Kambham). వీళ్లిద్దరు టీవీ సీరియల్స్ ద్వారానే మన ఆడియన్స్ కి దగ్గరై, ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత దగ్గరయ్యారు. కలిసి ఒక్క సీరియల్ లో కూడా పని చేయలేదు కానీ, ‘ఇష్మార్ట్ జోడి 3’ షో ద్వారా మాత్రం స్నేహితులు అయ్యారు. అయితే వీళ్లిద్దరు ఇప్పుడు పరోక్షంగా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. అమర్ దీప్ ని బాగా పరిశీలించిన వారు అతని మనస్తత్వం ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. అలా ఈసారి ఆయన తన స్నేహితుడు మానస్ కోసం నిలబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓంకార్ ఆహా యాప్ లో ‘డ్యాన్స్ ఐకాన్ 2’ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నాడు.
Also Read : మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిన శివాజీ..ఈసారి ఏకంగా సుకుమార్ తో!
ఈ ప్రోగ్రాం లో మానస్ ఒక కంటెస్టెంట్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు, అదే విధంగా ప్రేరణ సోదరి ప్రకృతి కూడా మరో కంటెస్టెంట్ కి మెంటర్ గా వ్యవహరిస్తుంది. అయితే ఈ సీజన్ ప్రారంభం నుండి వీళ్లిద్దరి మధ్య ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. తన కంటెస్టెంట్ రాకపోవడం వాళ్ళ మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని షో నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని రీసెంట్ గానే వైల్డ్ కార్డు ఎంట్రీ తో మళ్ళీ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మానస్ ని ‘నేను నిన్ను మళ్ళీ బయటకు గెంటేయాలని అనుకుంటున్నాను’ అంటూ మానస్ ని నామినేట్ చేస్తుంది. మానస్ కూడా నన్ను ఎవ్వరూ గెంటేయలేరు, దయచేసి మాటలు జాగ్రత్త అంటూ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వార్ నడించింది. ఈ అంశంపై అమర్ దీప్ స్పందిస్తూ, వ్యక్తిగత టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, దయచేసి నా స్నేహితుడికి వోట్ వేసి గెలిపించండి అని అడుగుతాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై ప్రేరణ స్పందిస్తూ ‘అందరూ నా చెల్లి ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. కేవలం మా చెల్లి మాట్లాడిన ఆ ఒక్క క్లిప్ ని పట్టుకొని ఎదో చెయ్యరని నేరం చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆమె ఆ మాట అన్న తర్వాత వెంటనే అలా మాట్లాడడం సరికాదని క్షమాపణలు కూడా చెప్పింది. మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్ కి ముందు అతని కంటెస్టెంట్ ప్రకృతి ని వ్యక్తిగతంగా అవమానించింది. దానికి ఇప్పటి నుండి అటు వైపు నుండి క్షమాపణ రాలేదు. కానీ నా చెల్లి బయటకు గెంటేస్తాను అనే క్లిప్ ని మాత్రం వైరల్ చేస్తున్నారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది కూడా ప్రచారం చేయొచ్చు కదా, చేస్తే మొత్తం చేయండి, ఇలా ఒక వ్యక్తి క్యారక్టర్ ని బ్యాడ్ చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ.