Daku Maharaj first Review : వరుస విజయాలతో ఎప్పుడూ లేనంత జోష్ లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ, తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ తో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి, తన జైత్ర యాత్రని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య వరుస హిట్స్ తో మంచి ఫామ్ మీద ఉన్నాడు, అదే విధంగా డైరెక్టర్ బాబీ కూడా ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో తన ప్రతిభ ని మరోసారి నిరూపించుకున్నాడు, అలాంటి వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి కాపీ నిన్న రాత్రి కొంతమంది సినీ ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు వేసి చూపించారు.
వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తి అయ్యాక, ఈ సినిమా ఎక్కడికి వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేం, ఆ రేంజ్ లో ఉందని డైరెక్టర్ బాబీ ని పొగడ్తలతో ముంచి ఎత్తారట. అంతే కాకుండా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయని, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వల్ మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది, ముఖ్యంగా తన కూతురుతో బాలయ్య బాబు కి ఉన్న అనుభందం గురించి చాలా ఎమోషనల్ గా తీసారని అంటున్నారు. మొత్తం మీద ఈ చిత్రం సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ గా ఉంటుందట. ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి కాసేపు పక్కన పెడితే, బాలయ్య సినిమా అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది యాక్షన్ సన్నివేశాలు.
ఈ చిత్రం లో వాటికి కొదవే ఉండదట. బాలయ్య హీరోయిజం ని ఎలివేట్ చేస్తూ డైరెక్టర్ బాబీ రాసుకున్న సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట. ఈ సినిమాతో బాలయ్య బాబు వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి చేరుతాడని, ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రం గా నిలిచిపోతుందని అంటున్నారు. బాలయ్య నటించిన అఖండ చిత్రం 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టగా, వీర సింహా రెడ్డి చిత్రం 86 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఇక గత ఎద్దటి ఆయన నుండి విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ హీరో విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్ సినిమాలతో కెరీర్ క్లోజ్ అయ్యే స్థితి నుండి, తాను చేసిన ఒక సినిమాని పక్క రాష్ట్రానికి చెందిన టాప్ హీరో రీమేక్ చేసే రేంజ్ లో బాలయ్య ప్రస్తుత సినీ ప్రయాణం ఉండగా, దానిని ‘డాకు మహారాజ్’ కొనసాగిస్తుందో లేదో చూడాలి.