Daku Maharaj movie story : బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో ప్రస్తుతం భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈయన చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందంటూ సినిమా మేకర్స్ భారీ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బాబీ లాంటి కమర్షియల్ డైరెక్టర్ బాలయ్య బాబు లాంటి కమర్షియల్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఆలా ఉండబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ యావత్తు తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాలయ్య బాబు ను మరొక మెట్టు పైకెక్కించిందనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం ఈ సినిమాని బాబి ఒక తెలుగు సూపర్ హిట్ సినిమా నుంచి కాపీ చేశారు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్ట్టింది.
ఎందుకు అంటే ఇంతకుముందు కూడా బాబీ చేసిన సినిమాలన్నీ తెలుగు సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాల్లోని కథను తిప్పి తిప్పి చెబుతూ ఉండడం మనం చాలా సార్లు చూశాం. ఇక ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంతకీ డాకు మహారాజ్ కథను ఏ సినిమా నుంచి కాపీ చేసి చేశాడు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే ఈ సినిమా ట్రైలర్ లో చిన్న పాపను పెంచుతూ బాలయ్య బాబు కనిపిస్తాడు.
అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో డాకు మహారాజ్ గా తన విశ్వరూపాన్ని చూపించిన సన్నివేశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నడుస్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా కూడా ఇదే టెంప్ లైన్ లో ఉంటుంది. మధ్యప్రదేశ్ లోని చెంబల ప్రాంతంలో రౌడిలకు చుక్కలు చూపించిన విక్రమ్ సింగ్ రాథోడ్ అలాగే అత్తిలి సత్తిబాబు ఈ రెండు క్యారెక్టర్లను బేస్ చేసుకుని సినిమా నడుస్తుంది.
అదే విధంగా బాలయ్య బాబు కూడా రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో డాకు మహారాజ్ గా తన విశ్వరూపాన్ని చూపించి ఆ తర్వాత తన భార్య చనిపోతే తన పాపను పెంచుకుంటూ బతుకుతున్నాడనే పాయింట్ ని ఇందులో కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఇద్దరు బాలకృష్ణ లు ఉన్నారా లేదంటే ఒక ఒక్కరే ఇద్దరు లా కనిపిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది…